Yadagirigutta : యాదాద్రికి స్వామి ఖజానాకు రూ. 4,13,283..క్షేత్రపాలకుడికి ఆకుపూజ

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఖజానాకు రూ. 4,13,283 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత వెల్లడించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజలు నిర్వహించారు.

Yadagirigutta : యాదాద్రికి స్వామి ఖజానాకు రూ. 4,13,283..క్షేత్రపాలకుడికి ఆకుపూజ

Yadadri

Yadadri : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పిలవబడే..యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో యాదాద్రి పుణ్యక్షేత్రం భక్తులతో సందడి నెలకొంటోంది. పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. ప్రధానంగా సెలవు దినాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోంది. కరోనా నియమ నిబంధనలు, ఆంక్షల నడుమ స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతినిస్తున్నారు. ఇదిలా ఉంటే..యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఖజానాకు రూ. 4,13,283 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత వెల్లడించారు.

Read More :  Kirtankar Tajuddin Baba : కీర్తనలు పాడుతూ..ప్రాణాలు వదిలిన బాబా.. వీడియో

ప్రధాన బుకింగ్ ద్వారా..రూ. 26 వేల 382, రూ. 100 దర్వనం టికెట్ ద్వారా రూ. 7 వేల 800, శాశ్వత పూజల ద్వారా రూ. 2 వేలు, వాహన పూజలతో రూ. 2 వేల 700, క్యారీ బ్యాగుల ద్వారా రూ. వేయి 550, ప్రసాద విక్రయం ద్వారా రూ. 1, 46, 895, వేద ఆశీర్వచనం ద్వరా రూ. వేయి 032, వ్రతపూజల ద్వారా రూ. 9 వేలు, కళ్యాణ కట్ట టికెట్ల విక్రయం ద్వారా రూ. 6 వేల 600, ప్రచార శాఖ ద్వారా రూ. 450, టోల్ గేట్ ద్వారా రూ. 330, పాత గుట్ట నుంచి రూ. 7 వేల 200, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 36 వేల 540, యాదరుషి నిలయం ద్వారా రూ. 21 వేల 600, అన్నదాన విరాళం ద్వారా రూ. 5 వేల 116, పుష్కరిణి ద్వారా రూ. 400, ఇతర విభాగాల ద్వారా రూ. 1,37,588..మొత్తంగా రూ. 4, 13, 283 ఆదాయం సమకూరినట్లు ఈవో వెల్లడించారు.

Read More : Thirumala : శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

మరోవైపు…యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్యక్షేత్రంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజలు నిర్వహించారు. స్వామిని ఆరాధిస్తూ..ఆళయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు పుష్కరిణి, పాతగుట్టలో కొలువుదీరిన హనుమంతిడికి సింధూరంతో అలంకరించి పంచామృతాలతో అభిషేకించారు. ఆంజనేయుడిని కొలుస్తూ..అర్చకులు వేదమంత్రాలను పఠించారు. సహస్రనామ పఠనాలతో తమలపాకుల అర్చన చేపట్టారు. తర్వాత..వడపప్పు, బెల్లం, అరటిపండ్లను నైవద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.