Thirumala : శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. అక్టోబర్ 4న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. అక్టోబర్ 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంది.

Thirumala : శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

Tirumala

VIP break darshan cancel : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. అక్టోబర్ 4న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. అక్టోబర్ 5న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుందని పేర్కొంది. అక్టోబర్‌ 6 సా.6 గంటల నుంచి 7 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని టీటీడీ తెలిపింది.

అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

Tirumala : ఇకపై అందరికీ తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం

బ్రహ్మోత్సవాల విశేషాలు
7న ఉదయం ధ్వజారోహణం – సాయంత్రం పెద్దశేష వాహనసేవ
8న ఉదయం చిన్నశేష వాహ‌నసేవ – సాయంత్రం హంస వాహనసేవ
9న ఉదయం సింహవాహన సేవ – సాయంత్రం ముత్యపు పందిరి వాహనసేవ
10న ఉదయం క‌ల్పవృక్ష వాహ‌నసేవ – సాయంత్రం సర్వభూపాల వాహనసేవ
11న ఉదయం మోహినీ అవతారం – సాయంత్రం గరుడ వాహనసేవ
12న ఉదయం హ‌నుమంత వాహ‌నసేవ – సాయంత్రం గజ వాహనసేవ
13న ఉదయం సూర్యప్రభ వాహ‌నసేవ – సాయంత్రం చంద్రప్రభ వాహనసేవ
14న ఉదయం సర్వభూపాల వాహనసేవ (రథోత్సవంకు బదులు) – సాయంత్రం అశ్వవాహనసేవ
15న ఉదయం పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం – సాయంత్రం ధ్వజారోహణం