Yash : సౌత్ సినిమాలు చూసి ఎగతాళి చేసేవాళ్ళు.. రాజమౌళి బాహుబలి తర్వాతే.. యష్ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా ముంబైలో జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో యష్ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో యష్ మాట్లాడుతూ సౌత్, బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడాడు. ఒకప్పుడు సౌత్ సినిమాలని ఎలా చూసేవారు అని కామెంట్స్ చేశాడు.............

Yash : సౌత్ సినిమాలు చూసి ఎగతాళి చేసేవాళ్ళు.. రాజమౌళి బాహుబలి తర్వాతే.. యష్ సంచలన వ్యాఖ్యలు..

Yash Sensational Comments on Bollywood regarding to south movies

Yash :  KGF, KGF 2 సినిమాల తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కన్నడ హీరో యష్. ఈ సినిమాతో అందరి చూపు కన్నడ సినీ పరిశ్రమ వైపు పడింది. అప్పటివరకు ఒక్క 100 కోట్ల సినిమా కూడా లేని కన్నడ పరిశ్రమకి ఏకంగా 1000 కోట్ల కలెక్షన్లని పరిచయం చేశాడు యష్. దీంతో దేశవ్యాప్తంగా KGF ప్రభంజనంతో యష్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.

తాజాగా ముంబైలో జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో యష్ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో యష్ మాట్లాడుతూ సౌత్, బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడాడు. ఒకప్పుడు సౌత్ సినిమాలని ఎలా చూసేవారు అని కామెంట్స్ చేశాడు.

Janhvi Kapoor : ఓర్హాన్‌‌తో డేటింగ్ వార్తలపై స్పందించిన జాన్వీ కపూర్..

ఈ కార్యక్రమంలో యష్ మాట్లాడుతూ.. ”పదేళ్ల క్రితమే డబ్బింగ్ సినిమాలు బాలీవుడ్ లో మంచి ఆదరణ పొందాయి. కానీ సౌత్ సినిమాలు చూసి బాలీవుడ్ వాళ్ళు ఎగతాళి చేసేవారు. ఇవేం ఫైట్స్, జనాలు ఇలా గాల్లోకి ఎగిరిపోతున్నారు అని కామెంట్స్ చేశారు, మా సినిమాలు చూసి నవ్వుకున్నారు. కానీ చివరికి వాళ్ళు సౌత్ సినిమాలోని కళని అర్ధం చేసుకున్నారు. ఒకప్పుడు సౌత్ సినిమాలు బాలీవుడ్ లో చాలా తక్కువ ధరలకు కొనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎలా కొంటున్నారో మీకు కూడా తెలుసు. ఇదంతా రాజమౌళి గారి బాహుబలి సినిమా నుంచే మొదలైంది. బాహుబలి సినిమా తర్వాత సౌత్ సినిమాలని అందరూ గుర్తిస్తున్నారు” అని అన్నాడు. దీంతో యష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో వైరల్ గా మారాయి. మరి దీనిపై బాలీవుడ్ వాళ్ళు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.