Yashwant Sinha: నాడు అలా.. నేడు ఇలా.. హైదరాబాద్‌లో అడుగిడనున్న యశ్వంత్ సిన్హా

2004లో సుమారు 18ఏళ్ల క్రితం హైదరాబాద్ లో మొదటిసారి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో యశ్వంత్ సిన్హా పాల్గొన్నారు. నాటి ప్రధాని వాజ్ పేయీ నేతృత్వంలోని విదేశాంగ మంత్రిగా ఉంటూ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. నేడు ఎన్డీయేతర విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన ప్రచార నిమిత్తం హైదరాబాద్ వస్తున్నారు.

Yashwant Sinha: నాడు అలా.. నేడు ఇలా.. హైదరాబాద్‌లో అడుగిడనున్న యశ్వంత్ సిన్హా

Yasvanth Sinha

Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీచేస్తున్నారు. యశ్వంత్ కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఈ క్రమంలో ఆయన టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి రాష్ట్రపతి ఎన్నికలో తనకు ఓటు వేయాలని కోరనున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్ కు వస్తున్న యశ్వంత్ కు బేగంపేట ఎయిర్ పోర్టులో స్వయంగా సీఎం కేసీఆర్ వెళ్లి ఘన స్వాగతం పలకనున్నారు. అంతేకాక ఎయిర్ పోర్టు నుంచి జలవిహార్ వరకు మోటార్ సైకిళ్ల ర్యాలీగా యశ్వంత్ సిన్హాను తీసుకురానున్నారు. అయితే యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్ లో వింత అనుభవం ఎదురుకానుంది.

Yashwant Sinha: నేడు హైదరాబాద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. ఘనస్వాగతం పలకనున్న టీఆర్ఎస్

నేడు, రేపు హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. 2004లో సుమారు 18ఏళ్ల క్రితం హైదరాబాద్ లో మొదటిసారి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో యశ్వంత్ సిన్హా పాల్గొన్నారు. నాటి ప్రధాని వాజ్ పేయీ నేతృత్వంలో విదేశాంగ మంత్రిగా ఉంటూ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. నేడు ఎన్డీయేతర విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన ప్రచార నిమిత్తం హైదరాబాద్ వస్తున్నారు. దీంతో నాడు అలా హైదరాబాద్ వచ్చిన యశ్వంత్ సిన్హా.. నేడు బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రచారం నిమిత్తం హైదరాబాద్ వస్తుండటం గమనార్హం. ఇదిలాఉంటే యశ్వంత్ సిన్హా ఉదయం 11గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వస్తుండగా.. ఆ తర్వాత 2.45 గంటల తేడాతో మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

Yashwant Sinha : విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా

యశ్వంత్ సిన్హా దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో పనిచేశారు. తన పదవికి రాజీనామా చేసి 1986లో జానతా పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. 1988లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్ తో ఆయన పార్టీపొత్తు పెట్టుకున్న తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేశారు. 1998 నుంచి 2002 వరకు అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా కూడా యశ్వంత్ పనిచేశారు. 2002లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో బీజేపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2018లో బీజేపీ ను వీడి 2021లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ తో పాటు విపక్షాల మద్దతుతో విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే యశ్వంత్ సిన్హాకు బీజేపీకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది.