Ghosts Exist : అవును.. దెయ్యాలున్నాయి.. ఐఐటీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

దెయ్యాలు ఉన్నాయి. నిజమే. అంటే మీరు నమ్ముతారా? దెయ్యాలు లేవు, భూతాలు లేవు. అదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తారా? కానీ, ఆయన మాత్రం దెయ్యాలు ఉన్నాయని అంటున్నారు..

Ghosts Exist : అవును.. దెయ్యాలున్నాయి.. ఐఐటీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Ghosts Exist

Ghosts Exist : ఈ భూమి మీద పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవి నిజమో కాదో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. అవి అంతుచిక్కని రహస్యాలు. వాటి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. వాదనలు, ప్రతివాదనలు నడుస్తూనే ఉంటాయి. ఇంతకీ ఆ అంశాలు ఏంటంటే.. ఏలియన్లు ఉన్నాయా? లేదా? దేవుడు ఉన్నాడా? లేడా? ఇవే కాకుండా మరొక ముఖ్యమైన ఆసక్తికర అంశం ఉంది. అదే.. దెయ్యాలు, భూతాలు ఉన్నాయా? లేదా? వీటి గురించి ఎవరి నమ్మకాలు వారివి. దేవుళ్లు, దెయ్యాలు ఉన్నాయని కొందరు.. లేవని కొందరు.. మాట్లాడుతుంటారు. దానికి అనుగుణంగా తమ వాదనలూ వినిపిస్తూ ఉంటారు. ఈ చర్చ ఎప్పటికీ ముగియంది.

Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!

ఇక మ్యాటర్ లోకి వెళితే.. దెయ్యాలు ఉన్నాయి. నిజమే. అంటే మీరు నమ్ముతారా? మనిషి స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్న ఈ రోజుల్లోనూ దెయ్యాలు, భూతాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మీరు అనొచ్చు. దెయ్యాలు లేవు, భూతాలు లేవు. అదంతా ట్రాష్ అని కొట్టిపారేయచ్చు. కాసేపు మీ సంగతి పక్కన పెడితే.. అవును.. దెయ్యాలు ఉన్నాయి..నిజమే.. అని ఓ ప్రముఖ వ్యక్తి అంటున్నారు. ఆయనెవరో కాదు.. ఐఐటీ మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బెహెరా.

అవును.. దెయ్యాలు ఉన్నాయి.. అంటూ బెహెరా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చారు. 1993లో తన స్నేహితుడి కుటుంబాన్ని పట్టిపీడిస్తున్న దుష్టశక్తులను తాను మంత్రాలు చదివి తరిమికొట్టినట్లు ఆయన ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఓ ప్రముఖ పతిక్రతో మాట్లాడుతూ.. అప్పట్లో దెయ్యాన్ని తరిమికొట్టేందుకు దాదాపు గంట సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. “నేను ఏదైతే చెప్పానో అది వివరించాను. దెయ్యాలు ఉన్నాయి. అవును. ఆధునిక శాస్త్రం చాలా సంఘటనలను వివరించలేదు” అని లక్ష్మీధర్ బెహెరా అన్నారు.

Butter Milk : అజీర్ణ సమస్యలకు చక్కని ఔషదం… మజ్జిగ

అవును.. దెయ్యాలు ఉన్నాయి..నిజమే.. అంటూ ఐఐటీ డైరెక్టర్ బెహెరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బెహెరా వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. బాగా చదువుకున్న వ్యక్తి, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి.. ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు. మరికొందరు.. బెహెరాను సమర్థిస్తున్నారు. మొత్తంగా దెయ్యాల గురించి మరోసారి హాట్ హాట్ డిస్కషన్ కు తెరలేసింది.