Young Villains : హీరోలే విలన్లు.. డిమాండ్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు విలన్లుగా చేసిన వాళ్లు హీరోలుగా సెటిలై పోతే.. ఇప్పుడు యంగ్ హీరోలే విలన్లుగా టర్న్ అవుతున్నారు..

Young Villains : హీరోలే విలన్లు.. డిమాండ్ మామూలుగా లేదుగా..

Young Villains

Young Villains: ఏ సినిమాలో అయినా హీరో హైలెట్ అవ్వాలంటే హీరోయిజం చూపించాలి. అందుకు స్ట్రాంగ్ విలన్ ఉండాలి. ఇప్పుడు విలన్లు కూడా హీరోకు ఏమాత్రం తీసిపోకుండా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. అంతే కాదు.. ఒకప్పుడు విలన్లుగా చేసిన వాళ్లు హీరోలుగా సెటిలై పోతే.. ఇప్పుడు యంగ్ హీరోలే విలన్లుగా టర్న్ అవుతున్నారు.

సినిమాల్లో హీరోలు విలన్లుగా టర్న్ అవుతున్నారు. లేటెస్ట్‌గా ఆది పినిశెట్టి మరోసారి విలన్‌గా తన సత్తా చూపించడానికి రెడీ అయ్యాడు. రామ్ – లింగు స్వామి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ఆది పినిశెట్టి స్టైలిష్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ‘అజ్ఞాతవాసి’, ‘సరైనోడు’ సినిమాల్లో యంగ్ అండ్ స్టైలిష్ విలన్‌గా అలరించిన ఆది.. ఈసారి యంగ్ హీరో రామ్‌తో తలపడబోతున్నాడు.

కార్తికేయ కూడా జస్ట్ హీరోగానే మిగిలి పోవాలనుకోవడం లేదు. ఈ యంగ్ హీరో కూడా వచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకుంటున్నాడు. అది నెగెటివ్ షేడ్ అయినా సరే.. విలన్ రోల్ అయినా సరే.. చక్కగా యూజ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు కార్తికేయ తమిళ్ స్టార్ హీరో అజిత్‌తో ఫైట్ చెయ్యబోతున్నాడు. అజిత్ ప్రస్తుతం చేస్తున్న ‘వాలిమై’ సినిమాతో కార్తికేయ విలన్‌గా తమిళనాట ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ‘గ్యాంగ్ లీడర్’ లో హీరో నానికి విలన్‌గా చేసి తనలోని మరో షేడ్‌ని చూపించాడీ ‘ఆర్ఎక్స్ 100’ హీరో.

Kartikeya

విలన్‌గా మారిన మరో టాలెంటెడ్ యాక్టర్ ఫాహాద్ ఫాజిల్. బన్నీ-సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప’. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా మూవీకి అడుగడుగునా జల్లెడ పట్టి, ఆఖరికి మళయాళ టాలెంటెడ్ హీరో ఫాహాద్ ఫాజిల్‌ని ప్రతినాయకుడి పాత్రకు తీసుకున్నారు సుకుమార్. ఫస్ట్ టైమ్ తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఫాహద్ అటు హీరోగా చేస్తూనే నెగెటివ్ రోల్స్‌లో బిజీగా ఉన్నారు.

Tollywood Industry : తెలుగు పరిశ్రమకు వలస వచ్చేస్తున్నారు..

మరో యంగ్ సౌత్ టాలెంట్ విజయ్ సేతుపతి కూడా హీరోగా బిజీగా ఉంటూనే విలన్ రోల్స్ చేస్తూ ఇంకా డిమాండ్ పెంచుకుంటున్నారు. లేటెస్ట్‌గా కమల్ హాసన్ – లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ ‘విక్రమ్’ లో విజయ్ సేతుపతి నెగెటివ్ క్యారెక్టర్‌లో కమల్‌కి పోటీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన రస్టిక్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వెర్సటైల్ యాక్టర్ ఇప్పటికే ‘ఉప్పెన’ లో రాయణం క్యారెక్టర్లో సూపర్బ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు.

Vijay Sethupathi