YS Sharmila: ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడను.. ముందస్తు ఎన్నికలొస్తే మాకే మంచిది -వైఎస్ షర్మిల

మేము ఏ పార్టీలతో కలిసేది లేదని, కేసీఆర్ యూపీలో ప్రచారం చేయడం అనేది పెద్ద జోక్ అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడను.. ముందస్తు ఎన్నికలొస్తే మాకే మంచిది -వైఎస్ షర్మిల

Ys Sharmila

YS Sharmila: మేము ఏ పార్టీలతో కలిసేది లేదని, కేసీఆర్ యూపీలో ప్రచారం చేయడం అనేది పెద్ద జోక్ అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్ దేశానికి వెళ్తే లక్షల్లో ఆత్మహత్యలు జరుగుతాయని అన్నారు షర్మిల. దేశాన్నే అమ్మే పరిస్థితి వస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు షర్మిల. రైతుల గురించి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడారు? అని ప్రశ్నించారు. రెండు కోట్ల మందికి బీజేపీ ఉద్యోగాలు ఇస్తానంటూ మోసం చేసిందని, కేసీఆర్ 33 జిల్లాలు ఏర్పాటు చేశారని, ఒక్క జిల్లాలో అయినా ఉద్యోగాలు భర్తీ చేశారా? అని నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ గురించి అయితే నేను మాట్లాడను.. కోవిడ్ పూర్తయిన తర్వాత మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని చెప్పారు షర్మిల. ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం మాకే మంచిదని కేసీఆర్ త్వరగా దిగిపోతారని అన్నారు షర్మిల.

పార్టీ రిజిస్ట్రేషన్ గురించి ఎన్నికల కమిషన్‌కి అప్లికేషన్ పెట్టుకున్నామని, విజయమ్మ కూడా No Objection లెటర్ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదో ఎన్నికల కమిషన్‌కే తెలియాలని అన్నారు.