YS Sharmila : కోట్లు ఇచ్చి.. మునుగోడులో ఓటర్లను టీఆర్ఎస్ కొనుగోలు చేసింది-షర్మిల

మునుగోడులో ఓటర్లను, ఎంపీటీసీలను కొని ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేయలేదా అని షర్మిల నిలదీశారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో ఎమ్మెల్యేకి అప్పజెప్పి ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించారు.

YS Sharmila : కోట్లు ఇచ్చి.. మునుగోడులో ఓటర్లను టీఆర్ఎస్ కొనుగోలు చేసింది-షర్మిల

YS Sharmila : టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తన ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు యత్నించారు అంటున్న కేసీఆర్.. అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనలేదా? ప్రశ్నించారు. మునుగోడులో ఓటర్లను, ఎంపీటీసీలను కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయలేదా అని నిలదీశారు. సీబీఐకి భయపడకపోతే ఎందుకు రాష్ట్రంలోకి అనుమతించలేదని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.

మునుగోడులో కేసీఆర్ ఏం చేశారు? ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేయలేదా? ఒక్కొక్క ఓటుకి వేల రూపాయలు ఇచ్చి కొనుకున్నారే. అది ఖూనీ చేయడం కాదా?

నల్లా తిప్పితే మునుగోడులో నీళ్లు రాలేదు. నల్లా తిప్పితే లిక్కర్ వచ్చింది కదా. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? ఒక్కో గ్రామాన్ని ఒక్కో ఎమ్మెల్యేకి అప్పజెప్పి అంతగా ప్రలోభపెట్టారే ఓటర్లను. అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? ఒక్క సర్పంచి, ఒక్క ఎంపీటీసీ, ఒక్క జెడ్పీటీసీకి కార్లు ఇచ్చారు, బైకులు ఇచ్చారు. కోట్లు ఇచ్చి కొనుకున్నారే. అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లు కాదా?

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరి కేసీఆర్ గారు మునుగోడులో ఏం చేశారు? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదు ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి మరీ ఖూనీ చేశారు కేసీఆర్. ఇది వాస్తవం కాదా? ఇదే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను కొనలేదు. ఎన్నిసార్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఈయన కొంటే తప్పులేదట, ఈయన ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ కొనాలని చూస్తోందని ఇప్పుడు గగ్గోలు పెడుతున్న కేసీఆర్.. ఆయన చేస్తే తప్పు కాదా? ఈయన చేస్తేనేమో ఒప్పు, పక్కనోడు చేస్తేనేమో తప్పా? ” అని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల.

Munugode: ‘మునుగోడు’లో టీఆర్ఎస్ గెలుపు.. రెండో స్థానంలో బీజేపీ.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్

”సీబీఐ ఎంక్వైరీ మీరే వస్తారా? నన్నే రమ్మంటారా? అని అడిగాలి కదా. అలా కాకుండా భయపడి సీబీఐ రాష్ట్రంలోకి రావడానికే వీల్లేదని కేసీఆర్ అన్నారంటే.. గుమ్మడికాయల దొంగ మీరే అని ప్రజలకు అర్థమైపోయింది. ఈయన తప్పు చేయకపోతే ఎందుకు బంద్ చేశారు సీబీఐ ఎంక్వైరీని” అని షర్మిల నిలదీశారు.