Improve Brain Function : మెదడు పనితీరు మెరుగుపడాలంటే ఆహారంలో ఈ పోషకాలు తప్పనిసరిగా చేర్చుకోండి!

మన శరీరానికి మెగ్నీషియం చాలా అవసరం. ఒంట్లో మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటే మైగ్రేన్ నొప్పి, నిరాశ, అనేక నాడీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు తినే ఆహారంలో మెగ్నీషియం పుష్కలంగా ఉండేట్టు చూసుకోండి.

Improve Brain Function : మెదడు పనితీరు మెరుగుపడాలంటే ఆహారంలో ఈ పోషకాలు తప్పనిసరిగా చేర్చుకోండి!

Add these nutrients to your diet to improve brain function!

Improve Brain Function : వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పనితీరు క్షీణిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఇందుకు ముఖ్యకారణం మెదడు ఆరోగ్యం దెబ్బతినడం. అయితే మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని పోషకాలు ఎంతగానో తోడ్పడతాయి. అందులో ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. మెదుడు ఆరోగ్యంగా ఉంచే వాటిలో ముఖ్యమైన పోషకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు ; ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అభ్యసన సామర్థ్యాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. ఇవి సాల్మన్ వంటి సీ ఫుడ్, అవొకాడో, ఆలివ్ ఆయిల్, వాల్ నట్స్, గుడ్లు, రెడ్ మీట్, పొద్దుతిరుగుడు నూనె, గుమ్మడి గింజల్లో పుష్కలంగా లభిస్తుంది.

2. ఇనుము ; ఇనుము మెదడుకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలలో ఇది కూడా ఒకటి . DNA సంశ్లేషణ, మైటోకాన్డ్రియల్ శ్వాసక్రియ, మైలిన్ సంశ్లేషణ, న్యూరోట్రాన్స్మిటర్ సంశ్లేషణ, జీవక్రియ వంటి మెదడు పనితీరులో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను పుష్కలంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలకూర, చిక్కుళ్లు, గుమ్మడి గింజలు, గుడ్లు, డార్క్ చాక్లెట్స్, ఎండుద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, పప్పు ధాన్యాల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.

3. విటమిన్ డి ; ఎముకల పెరుగుదలకు, దంతాల బలానికి విటమిన్ డి చాలా అవసరం. ఈ విటమిన్ మెదడుకు కూడా చాలా అవసరం. వృద్ధులలో ఇది చిత్తవైకల్యం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని నివారిస్తుంది. ఈ విటమిన్ డి సూర్యరశ్మి, గుడ్డులోని పచ్చసొన, చేపలు, పుట్టగొడుగులు, పాలు, పాల ఉత్పత్తులు, గోధుమలు, రాగులు, ఓట్స్, బాదం పాలు, సోయా పాలలో విటమిన్ డి ఎక్కువ మొత్తంలో ఉంటుంది.

4. మెగ్నీషియం ; మన శరీరానికి మెగ్నీషియం చాలా అవసరం. ఒంట్లో మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటే మైగ్రేన్ నొప్పి, నిరాశ, అనేక నాడీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు తినే ఆహారంలో మెగ్నీషియం పుష్కలంగా ఉండేట్టు చూసుకోండి. మొలకలు, బ్రోకలీ, ఆకు కూరలు, గ్రీన్ బఠాణీలు, క్యాబేజీ, అరటిపండ్లు, గుమ్మడి గింజలు, బాదం పప్పులు, డార్క్ చాక్లెట్ లో మెగ్నీషియం బాగా ఉంటుంది.

5. సెలీనియం ; సెలీనియం మన మెదడుకు యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యాన్ని పెంచుతుంది. థైరాయిడ్ హార్మోన్ జీవక్రియ, డిఎన్ఎ సంశ్లేషణ, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సెలీనియం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సెలీనియం చేపలు, గింజలు, విత్తనాలు, మాంసం, బ్రౌన్ రైస్, పాల ఉత్పత్తులు, గుడ్లు, పుట్టగొడుగులు, ఓట్ మీల్ , కాయ ధాన్యాల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.

వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా అన్ని వయసులవారిలో మెదడు పనితీరును మెరుగుపరుచుకోవచ్చు.