Alcohol Measurement: మద్యం ఈ కొలతతో తీసుకుంటే నో ప్రాబ్లమ్ అంట

ఆల్కహాల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ది లాన్సెట్ జర్నల్‌ ప్రచురించారు. వయస్సు, లింగం, భౌగోళిక ప్రాంతం వంటి అంశాల ఆధారంగా మద్యం ప్రభావం కనపడుతున్నట్లు వెల్లడైంది.

Alcohol Measurement: మద్యం ఈ కొలతతో తీసుకుంటే నో ప్రాబ్లమ్ అంట

Alcohol

 

 

Alcohol Measurement: ఆల్కహాల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ది లాన్సెట్ జర్నల్‌ ప్రచురించారు. వయస్సు, లింగం, భౌగోళిక ప్రాంతం వంటి అంశాల ఆధారంగా మద్యం ప్రభావం కనపడుతున్నట్లు వెల్లడైంది.

“తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడమనేది ఆరోగ్యంపై ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ కొందరిలో మాత్రం ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రాంతం, వయస్సు, లింగ బేధాలను బట్టి అనారోగ్యానికి గురవుతున్నారు” అని స్టడీలో తెలిసింది.

ఈ అనాలసిస్ కోసం, 204 దేశాలలోని వారిపై ఆల్కహాల్ శాంపుల్స్‌ను ఉపయోగించారు. అలా 2020లో 1.34 బిలియన్ల మంది ప్రజలు హానికరమైన బ్రాండ్లను వినియోగించినట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా 15 – 39 సంవత్సరాల మధ్య వయస్సున్న పురుషుల్లో హానికరమైన ఆల్కహాల్ సేవించే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిసింది. ప్రతి ప్రాంతంలోనూ, అసురక్షిత మొత్తంలో ఆల్కహాల్ సేవించే జనాభాలో అత్యధికులు ఈ వయస్సులోని వారే.

Read Also: “బాగా పనిచేయండి, సెలవుల్లో రెస్ట్ తీసుకోండి, ఆల్కహాల్ తాగండి.. ఎక్కువ కాలం బతకండి”

జనాభాలోని ఈ విభాగంలో ఆల్కహాల్ సేవించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉండవని.. కేవలం ప్రమాదాలు మాత్రమే కలుగుతాయని పరిశోధకులు కనుగొన్నారు. మోటారు వాహన ప్రమాదాలు, ఆత్మహత్యలు, నరహత్యలతో సహా ఈ వయస్సులోని వ్యక్తులలో 60 శాతం ఆల్కహాల్ సంబంధిత గాయాలకు దారితీస్తాయని తెలిపారు.

“వృద్ధులతో పోలిస్తే యువతలో వినియోగం ఎక్కువ. ఈ వయస్సులో తోటివారి ఒత్తిడి కూడా ఉంది. చాలా మంది కాలేజీ, ఆఫీసు వెళ్లే వయస్సు వారే తాగడం ప్రారంభిస్తున్నారు. తక్కువ జీతాలు ఉన్నందున సాధారణంగానే తక్కువ ధర మద్యం తాగుతున్నారు. ఇది తీవ్రమైన కాలేయ గాయాలకు దారి తీస్తుంది” అని శారదా హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ శ్రేయ్ శ్రీవాస్తవ్ వివరించారు. చెప్పారు .

ఒక వ్యక్తి ఈ వయస్సులో ఆల్కహాల్ తీసుకుంటే, మనుగడ వయస్సు గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. “మద్యం సేవించని వ్యక్తులలో 70-75 సంవత్సరాలతో పోలిస్తే మనుగడ వయస్సు 55-60 సంవత్సరాలకు తగ్గుతుంది.”

Read Also: డైలీ లైఫ్‌లో ఆల్కహాల్ ఉపయోగాలు

ఆల్కహాల్ ఎంతవరకూ తీసుకోవడం సురక్షితం?

15-39 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు మొత్తం రోజుకు 0.136 స్టాండర్డ్ డ్రింక్‌లు. ఇదే వయస్సులోని స్త్రీలకు, రోజుకు 0.273 డ్రింక్‌లు. 40 అంతకంటే ఎక్కువ వయస్సున్న పెద్దలకు మగవారికి 0.527 డ్రింక్‌లు, ఆడవారికి 0.562 డ్రింక్‌ల నుంచి దాదాపు రెండు స్టాండర్డ్ డ్రింక్‌లు. 65 ఏళ్లు పైబడిన పెద్దలకు, రోజుకు మూడు స్టాండర్డ్ డ్రింక్‌ల కంటే కొంచెం ఎక్కువ. అంటే మగవారికి 3.19 డ్రింక్‌లు, ఆడవారికి 3.51 డ్రింక్‌లని రికమెండ్ చేస్తున్నారు.

స్టాండర్డ్ డ్రింక్ అనేది తీసుకునే ఆల్కహాల్ ను బట్టి ఉంటుంది. సాధారణంగా బీర్ స్టాండర్డ్ డ్రింక్ సైజ్ 330మిల్లీలీటర్. విస్కీ, జిన్ లాంటి ఇతర హార్డ్ ఆల్కహాల్ కోసమైతే 30మిల్లీలీటర్ మాత్రమే. అదే వైన్ అయితే 150మిల్లీలీటర్.