Radish : జీర్ణక్రియను మెరుగుపరచటంతోపాటు , గుండె ఆరోగ్యానికి మేలు చేసే ముల్లంగి!

ముల్లంగి లో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లకు ఇదే మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. మూత్రవ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. కిడ్నీ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

Radish : జీర్ణక్రియను మెరుగుపరచటంతోపాటు , గుండె ఆరోగ్యానికి మేలు చేసే ముల్లంగి!

Radish : ముల్లంగిని డైట్ లో చేర్చుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ముల్లంగిని సలాడ్లు, కూరలు, పప్పులు మరియు పరోటాలలో ఉపయోగించవచ్చు. ముల్లంగిలో విటమిన్ ఎ, బి6, ఇ, కె, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వాటిలో ఫైబర్, జింక్ పొటాషియం, మెగ్నీషియం, కాపర్ కాల్షియం, ఐరన్, మాంగనీస్ మరియు ఫాస్పరస్ కూడా ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి మరియు మన శరీరాన్ని పోషిస్తాయి. ముల్లంగి ఘాటైన రుచికారణంగా చాలా మంది ఇష్టపడరు. అయితే దీని ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం వదిలిపెట్టరు.

ముల్లంగిని ఆహారంగా తీసుకుంటే ప్రయోజనాలు ;

1. ముల్లంగిలో ఆంథోసైనిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు మీ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి గుండె జబ్బులను నివారిస్తాయి. ముల్లంగిలోని విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ మరియు ఫ్లేవనాయిడ్స్‌ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముల్లంగిని రోజువారిగా కొద్దిమోతాదులో తీసుకోవడం వల్ల కాలేయం మరియు జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. ముల్లంగి ఆకులతో కామెర్లు చికిత్స చేయవచ్చు. రక్తాన్ని శుద్ధి చేయటంలో సహాయపడుతుంది.

2. హైపోథైరాయిడ్ రోగులకు ముల్లంగిలోని సల్ఫర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాలను నిర్మించడంలో సహాయపడుతుంది. కణాలు దెబ్బతినవు. రక్తంలో ఆక్సిజన్ సరఫరా కూడా పెరుగుతుంది. గాల్ బ్లాడర్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది శరీరంలో ఎక్కువ ద్రవం పేరుకుపోకుండా నిరోధిస్తుంది.

3. ముల్లంగిలో ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే అధిక స్థాయిలో పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరానికి రక్త సరఫరా మెరుగుపడుతుంది. ముల్లంగిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తరచుగా వచ్చే జలుబు, దగ్గు రాకుండా కాపాడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఫ్రీ రాడికల్స్‌ను తొలగించగలదు. ఇది వాపును తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది.

4.ముల్లంగి చర్మానికి మేలు చేస్తుంది. ముల్లంగిలో ఉండే విటమిన్ సి, జింక్ మరియు ఫాస్పరస్ ద్వారా చర్మానికి రక్షణ లభిస్తుంది. చర్మం చాలా పొడిగా ఉండదు. దురద, మొటిమలు మరియు మచ్చలు తక్కువగా ఉంటాయి. ముల్లంగి పేస్ట్ చర్మాన్ని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. చుండ్రు తగ్గుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

5. ముల్లంగి తీసుకోవట వల్ల శరీరంలో కొల్లాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. ఎసిడిటీ, అధిక బరువును తగ్గిస్తుంది. ముల్లంగి వికారం మరియు గ్యాస్ సమస్యలను తగ్గించటలో తోడ్పడుతుంది.

6.ముల్లంగి లో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లకు ఇదే మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. మూత్రవ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. కిడ్నీ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

7.ముడుచుకుపోయిన గాలి గొట్టాలను విప్పార్చే గుణం ముల్లంగికి ఉంటుంది. కాబట్టి బ్రాంకైటిస్, ఆస్తమా సమస్యలకు ముల్లంగి మంచి విరుగుడుగా పనిచేస్తుంది. చలికాలంలో ముల్లంగి తినడం వల్ల జలుబు, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.

8.ముల్లంగి రసం రోజూ తాగితే ఇందులో ఉన్న సీ విటమిన్‌ వల్ల చర్మం కాంతిమంతమవుతుంది. మొటిమలు, రాషెస్‌ ఉంటే ఇట్టే మాయమైపోతాయి. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేందుకు ముల్లంగి చక్కగా పనిచేస్తుంది. మొలల సమస్యకు దూరంగా ఉండవచ్చు.