Sperm Quality In Men : మగవారిలో స్పెర్మ్ నాణ్యత తగ్గిపోవటానికి కొన్ని ఆహారాలే కారణమా?

అధిక కొవ్వు ఉన్న డెయిరీ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన మాంసం, ఆల్కహాల్, కాఫీ లాంటివి సెమెన్ క్వాలిటిని, సంతాన అవకాశాలను తగ్గిస్తాయి. స్మోకింగ్ వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గడమే కాకుండా, వాటి కదలికలు తగ్గడం, వాటి ఆకారంలో అసహజ మార్పులు రావడం జరుగుతుంది.

Sperm Quality In Men : మగవారిలో స్పెర్మ్ నాణ్యత తగ్గిపోవటానికి కొన్ని ఆహారాలే కారణమా?

Sperm Quality In Men :

Sperm Quality In Men : మగవారిలో స్పెర్మ్ నాణ్యతను కొన్ని రకాల ఆహారాలు తగ్గిస్తాయి. ఇటీవలి కాలంలో అనేక పరిశోధనల్లో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుతున్నట్లు తేలింది. దీనికి ముఖ్య కారణం జీవనశైలి , ఆహారపు అలవాట్లుగా నిర్ధారణకు వచ్చారు. రోజువారిగా తీసుకునే ఆహారం స్పెర్మ్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ విషయం చాలా మందిలో అవగాహన ఉండదు. స్పెర్మ్ కౌంట్ తగ్గటంలో తీసుకునే ఆహారం పాత్ర కూడా ఉంటుంది.

మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వల్ల కూడా పెళ్లై చాలాకాలం అయినప్పటికీ సంతాన లేమి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అతిగా మద్యం తాగేవారిలో, ఊబకాయం ఉన్నవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది.

ఈ ఆహారాల జోలికి వెళ్లకండి ;

స్పెర్మ్ కౌంట్ తగ్గటంలో కొన్ని ఆహారాలే కారణం. ప్రాసెస్ చేసిన మాంసాహారం అనేక రకాల జబ్బులను కలిగిస్తాయి. అంతేకాకుండా స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాలు సైతం స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సోయా ఉత్పత్తులు తినేవారిలో ఈ కౌంట్ తక్కువగా ఉంటుంది. వీటిలో పైటోఈస్ట్రోజన్, ఈస్ట్రోజన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి.

అధిక కొవ్వు ఉన్న డెయిరీ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన మాంసం, ఆల్కహాల్, కాఫీ లాంటివి సెమెన్ క్వాలిటిని, సంతాన అవకాశాలను తగ్గిస్తాయి. స్మోకింగ్ వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గడమే కాకుండా, వాటి కదలికలు తగ్గడం, వాటి ఆకారంలో అసహజ మార్పులు రావడం జరుగుతుంది. వాయు కాలుష్యం, వ్యాయామం లేకపోవడం, పర్యావరణ కాలుష్యం, పురుగుల మందులు అవశేశాలు, స్మోకింగ్, డ్రింకింగ్, ఆరోగ్యాన్ని పాడు చేసే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల పురుషుల్లో స్మెర్మ్ కౌంట్ బాగా తగ్గుతుంది.

పళ్లు, కూరగాయలు, చేపలు, గుడ్లు, తృణధాన్యాలు, సెలేనియం, జింక్ , ఒమెగా 3 ఫాటీ యాసిడ్స్ లాంటివి వీర్యం నాణ్యతను పెంచడానికి తోడ్పడతాయి. వీర్యకణాల సంఖ్య పెరగాలంటే మందును ఎక్కువగా తాగడకూడదు. స్మోకింగ్ మానేయాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. గుండెను ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్రపోవాలి. ఒత్తిడికి గురికాకుండా రక్తపోటును కంట్రోల్ లో ఉంచుకోవాలి. ముఖ్యంగా సుఖవ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వీర్య పరిమాణం, వీర్య కణాల సంఖ్య, వాటి కదలిక, సరైన ఆకృతి వున్న కణాలు తగ్గిపోవటం వంటి సంతానలేమికి కారణమౌతాయి. నిద్రలేమి వంటివి కూడా దీనికి కారణమౌతాయి. ఇలాంటి పరిస్ధితి ఉన్నట్లైతే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.