Triglycerides : ట్రైగ్లిజెరైడ్ల అధిక స్ధాయి శరీరానికి హాని కరమా?…

జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవటం మంచిది. తృణధాన్యాలు, బీన్స్, పండ్లు, కూరగాయలు, గుమ్మడికాయ గింజలు, రోజుకు 25గ్రాముల లోపు ఫైబర్ ను శరీరానికి అందించేలా చూసుకోవాలి.

Triglycerides : ట్రైగ్లిజెరైడ్ల అధిక స్ధాయి శరీరానికి హాని కరమా?…

Triglycerides

Triglycerides : శరీరంలో రక్త ప్రవాహంలో కనిపించే ఒక రకమైన కొవ్వు పదార్ధాలే ట్రైగ్లిజరైడ్లు. కొన్ని రకాల ఆహారాల కారణంగా శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్ధాయి పెరుగుతుంది. ప్రారంభంలో ఇవి కొవ్వు కణాలలో నిల్వ చేయబడి తరువాత రక్త ప్రవాహంలోకి విడుదలవుతాయి. రక్త ప్రసరణలో అధిక మొత్తంలో ట్రైగ్లిజరైడ్లు ఉండటం వల్ల శరీర ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ట్రైగ్లిజరైడ్ల స్ధాయి అధిక మొత్తంలో ఉండటాన్ని ట్రైగ్లిసరిడామియా అంటారు. శరీరంలో కేలరీలు అధికంగా పేరుకుపోయినప్పుడు శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి.

ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉండటం వల్ల కొన్ని రకాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. రక్తనాళాలు గట్టిపడటం, గుండె రక్తనాళాలు కుచించుకుపోవటం, మెదడు రక్తాన్ని నిరోధించటం, క్లోమంలో సమస్యలు ఉత్పన్నమై కడుపులో తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొన్ని రకాల ఇతర సమస్యల వల్ల సైతం ట్రైగ్లిజరేడ్స్ స్ధాయి అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఊబకాయం, మధుమేహం, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండ సమస్యలు, జన్యు ప్రభావం, అరుగుదల శక్తికి మించి అధిక కేలరీల ఆహారాన్ని తీసుకోవటం, ఎప్పుడు నీడపటునే కూర్చుని ఉండటం, మద్యం అలవాటు, ధూమపానం, శుద్ధి చేసిన చక్కెరలు, ఇతర వ్యాధులకు వాడే మందులు, హార్మోన్ల చికిత్స పొందుతున్న వారిలో ట్రైగ్లిజరైడ్స్ స్ధాయి పెరిగే అవకాశాలు ఉంటాయి.

లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ద్వారా రక్తప్రవాహంలో అధిక ట్రైగ్లిజరైడ్స్ స్ధాయిలను తెలుసుకోవచ్చు. 150 mg/dl కన్నా తక్కువగా ఉంటే సాధారణ స్ధాయిగా చెప్పవచ్చు. 150నుండి 199 ఎంజీ/డీఎల్‌ ఉంటే బోర్డర్ లైన్ లో ఉన్నట్లు, 200నుండి499 ఎంజీ/డీఎల్‌ ఉంటే ఎక్కువగా 500 mg/dl అంతుకు మించి ఉంటే అధికస్ధాయి రిస్క్ లో ఉన్నట్లు చెప్పవచ్చు. ట్రైగ్లిజరైడ్ల స్ధాయి అధికంగా ఉంటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ అధికస్ధాయిలు గుండెకు రక్తప్రవాహా మార్గానికి అడ్డంకులుగా మారతాయి. కొన్ని రకాల లక్షణాలు కూడా ట్రైగ్లిజరైడ్ల అధికస్ధాయి లో కనిపిస్తాయి. పొత్తి కడుపులో నొప్పి, సాధారణ అనారోగ్యం, భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరంగా ఉండటం, అజీర్ణ సమస్య, క్లోమంలో మంట, బరువు తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ట్రైగ్లిజరైడ్ల స్ధాయి అధికంగా ఉన్నవారు కొన్ని ఆహారాలను తీసుకోకపోవటమే మంచిది. ఫ్రక్టోజ్ అధికంగా ఉండే తేనె వంటి తీపి కలిగిన సిరప్ లను, జామ్ లు, ఐస్ క్రీం, కేకులు, చాక్లెట్ లు, చక్కెరతో తయారైన స్వీట్లు , రొట్టెలు, శీతలపానీయాలు, ఫ్రూట్ షేక్స్, చాక్లెట్ షేక్స్ , గోధుమలు, వైట్ రైస్, నెయ్యి, వెన్న, మద్యపానం వంటి వాటిని ఆహారంగా తీసుకోవటం ఆపేయాలి. రొయ్యలు, వూంసం, చికెన్‌ స్కిన్‌, డీప్‌గా వేయించిన వేపుళ్లను తగ్గించాలి. ఎక్కువగా బరువు ఉంటే శరీర బరువు సాధారణస్థాయికి వచ్చేలా ఆహారంలో క్యాలరీలు తగ్గించుకోవాలి.

జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవటం మంచిది. తృణధాన్యాలు, బీన్స్, పండ్లు, కూరగాయలు, గుమ్మడికాయ గింజలు, రోజుకు 25గ్రాముల లోపు ఫైబర్ ను శరీరానికి అందించేలా చూసుకోవాలి. అలాగని అధిక ఫైబర్ ఆహారాలను తీసుకోవటం వల్ల జీర్ణపరమైన సమస్యలు, మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. తగినంతగా నీరు తాగాలి. ఇంట్లో వంట చేసేటప్పుడు, ఆలివ్, అవిసె గింజ, వాల్నట్ ఆయిల్ వంటివి వాడుకోండి. చేపలతో పాటు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అవిసె గింజలు, చిక్కుళ్ళు, సోయా ఉత్పత్తులు , పాలకూర, బచ్చలికూర, వంటి ఆకుకూరలను తీసుకోవటం మంచిది. కేలరీలు బర్న్ చేయడం వల్ల శరీరంలో అదనపు ట్రైగ్లిజరైడ్స్ స్ధాయిలను తగ్గించవచ్చు. రోజుకు 45 నిమిషాల సమయం చురుకు నడవటం, స్విమ్మింగ్ వంటివి పాటించటం మేలు.