High Blood Glucose : ఈ లక్షణాలు కనిపిస్తే రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు అధికంగా ఉన్నట్లే?

మధుమేహ లక్షణాల్లో ఆకలి పెరుగటం కూడా ఒకటి దీనినే పాలీఫాగియా అని కూడా అంటారు. తగినంతగా ఆహారం తీసుకున్న తరువాత కూడా ఆకలి వేస్తుంటే అనుమానించాలి.

High Blood Glucose : ఈ లక్షణాలు కనిపిస్తే రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు అధికంగా ఉన్నట్లే?

High Blood Glucose

High Blood Glucose : రోజువారిగా మీరు తీసుకునే కార్బోహైడ్రేట్లు శరీరంలో విచ్ఛిన్నమవుతాయి. ఈ ప్రక్రియ వల్ల గ్లూకోజ్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక రకమైన చక్కెర. కణాలకు ప్రాథమిక శక్తి వనరుగా గ్లూకోజ్ ఉపయోగపడుతుంది. కాలేయం, కండరాలు మరియు కొవ్వులలోని కణాలు సరిగ్గా పనిచేయడానికి ఈ గ్లూకోజ్‌ తోడ్పడుతుంది. ఇన్సులిన్ వల్ల ఇది సాధ్యమవుతుంది. శరీరం ఉపయోగించని అదనపు గ్లూకోజ్ కొవ్వులుగా నిక్షిప్తం చేయబడుతుంది. శరీరంలో తక్కువ గ్లూకోజ్ స్థాయిలు ఉన్నప్పుడు ఈ కొవ్వులు మీకు శక్తిని అందిస్తాయి.

శరీరంలో ఇన్సులిన్ స్థాయి చాలా తక్కువగా ఉన్నా, శరీరం ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించనప్పుడు, శరీరం రక్తం నుండి కణాలకు గ్లూకోజ్‌ను తరలించలేకపోతుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ అధిక స్థాయిలో ఉంటుంది. రక్తంలో చక్కెరలు ఎప్పుడూ పరిమిత మోతాదులో ఉండాలి. లేకుంటే మధుమేహానికి కారణమౌతుంది. బ్లడ్ గ్లూకోజ్ హెచ్చుతగ్గులు ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, స్ట్రోక్‌కు దారితీయవచ్చు. ఎప్పటికప్పుడు రక్త పరీక్ష ద్వారా బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను తెలుసుకుంటూ ఉండాలి.

ఆహారం తీసుకున్న 2 గంటల తర్వాత రక్తంలో గ్లూకోజ్ 180 ఉందంటే దాన్ని అధిక స్థాయిగా పరిగణించాలి. 100 – 125 మధ్య ఉంటే అంతకుముందు 8 గంటల నుంచి ఏమీ తినకపోతే అప్పుడు కూడా అధిక స్థాయిగానే పరిగణించాలి. మధుమేహం రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ, వచ్చిన తర్వాత డయాబెటిస్ కు వెంటనే చికిత్స అవసరం. హై బ్లడ్ గ్లూకోజ్‌ ఉన్నట్టు కొందరికి తెలియదు.

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే హై బ్లడ్‌ షుగర్‌గా అనుమానించాల్సిందే ;

1. మూత్ర పిండాలు రక్తంలోని షుగర్‌ను వడ కట్టలేక గ్లూకోజ్‌ను బయటకు పంపించే ప్రయత్నం జరుగుతుంది. దీంతో తరచూ మూత్ర విసర్జన అవసరం పడుతుంది.

2. రక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉన్నప్పటికీ శరీరం శక్తిగా మార్చుకోలేని స్థితిలో ఉంటుంది. దాంతో శక్తి చాలక అలసట అనిపిస్తుంది.

3. రక్తంలో గ్లూకోజు పెరగటం వల్ల కంటి వెనుక భాగంలో రక్తనాళాల పరిమాణం పెరుగుతుంది. ఇదే కంటి చూపు తగ్గిపోయేందుకు దారితీస్తుందని గుర్తించాలి. అస్పష్టమైన దృష్టిని కలిగి ఉన్నారంటే రక్తంలో అధిక చక్కెరకు సూచనగా చెప్పవచ్చు.

4. రక్తంలో అధికంగా గ్లూకోజ్ ఉన్నా ఇన్సులిన్ లేమి కారణంగా దాన్ని శరీరం ఉపయోగించుకోలేదు. దీనికి బదులు శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులను వాడుకుంటుంది. ఫలితంగా శరీరం బరువు కోల్పోతారు.

5. అధిక మొత్తంలో గ్లూకోజ్‌ కండరాలకు చేరినప్పుడు శరీరం డీహైడ్రేట్‌ అయి దాహం వేస్తుది. దాంతో మనం ఎక్కువగా నీరు తాగుతుంటాం.

6. మూత్రం తీపి వాసనగా వస్తుందంటే రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉన్నదని అనుమానించాలి. రక్తంలోని చక్కెరలు రక్తం నుంచి మూత్రపిండాల ద్వారా మూత్రం రూపంలో బయటకు పోతూ తీపి వాసనను ఇస్తుంది.

7. రక్తప్రవాహానికి కూడా అడ్డంకులు ఏర్పడతాయి. ఫలితంగా తిమ్మిర్లు, జలదరింపు వస్తుంటాయి.

8. మధుమేహ లక్షణాల్లో ఆకలి పెరుగటం కూడా ఒకటి దీనినే పాలీఫాగియా అని కూడా అంటారు. తగినంతగా ఆహారం తీసుకున్న తరువాత కూడా ఆకలి వేస్తుంటే అనుమానించాలి.

9. ఏదైనా చిన్నచిన్న గాయాలైనా పుండ్లు మానేందుకు ఎక్కువ సమయం పడుతుంది. మధుమేహం కారణంగా రక్తప్రవాహం సరిగా లేక శరీరంలో అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌ సరఫరా జరుగదు. దీని కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది.

10. శరీరంలో అధిక చక్కెర స్ధాయి కారణంగా చర్మం దురద పెడుతుంది. చంకలు, నోరు, జననాంగాల వద్ద దురద ఉంటుంది. మెడ, చంకలో నల్ల మచ్చలు వస్తే మధుమేహ లక్షణంగా అనుమానించాలి.

మధుమేహం యొక్క సంకేతాలు మరియు లక్షణాలు కొన్నిసార్లు స్పష్టంగా ఉండవు లేదా నెమ్మదిగా కనిపించవచ్చు. ఏమాత్రం అనుమానం వచ్చిన వైద్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా తెలుసుకోవచ్చు. సకాలంలో చికిత్స ప్రారంభిస్తే దీర్ఘకాలం ఇబ్బందులు లేకుండా జీవించేందుకు అవకాశం ఉంటుంది.