Covaxin Antibody : కోవాగ్జిన్ టీకాతో పెద్దల్లో కంటే పిల్లల్లోనే అధిక యాంటీబాడీలు.. ఎంతంటే?

భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్ ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్ ఫలితాల్లో కోవాగ్జిన్ టీకా పిల్లలలో సురక్షితమైనదిగా తేలింది.

Covaxin Antibody : కోవాగ్జిన్ టీకాతో పెద్దల్లో కంటే పిల్లల్లోనే అధిక యాంటీబాడీలు.. ఎంతంటే?

Bharat Biotech Covaxin Better Antibody Response In 2 18 Year Olds Than Adults

Covaxin Antibody Response : ప్రముఖ దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్ (Covaxin Vaccine) ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్ ఫలితాల్లో కోవాగ్జిన్ టీకా పిల్లలలో సురక్షితమైనదిగా తేలింది. అంతేకాదు.. కోవాగ్జిన్ టీకా రోగనిరోధక శక్తిని తట్టుకోగలదని ట్రయల్స్ ఫలితాల్లో తేలిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పిల్లలపై నిర్వహించిన కొవిడ్‌ టీకా కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను భారత్‌ బయోటెక్‌ (Bharat Bio Tech) ప్రకటించింది. రెండో, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాల్లో కోవాగ్జిన్‌ టీకా 2ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలపై అత్యుత్తమ ఫలితాలను చూపిందని భారత్ బయోటెక్ పేర్కొంది.

కోవాగ్జిన్ యాంటీబాడీల ఉత్పత్తి పెద్దవారిలో కంటే సగటున పిల్లల్లోనే 1.7 రెట్లు అధికంగా ఉన్నట్టు కనుగొన్నట్టు తెలిపింది. ఈ ట్రయల్స్ ఫలితాలను ప్రిప్రింట్ సర్వర్ medRxivలో అప్‌లోడ్ చేసింది. రెండవ డోస్ నుంచి నాలుగు వారాల తర్వాత అన్ని వయస్సుల పిల్లలలో 95శాతం నుంచి 98శాతం వద్ద సెరోకన్వర్షన్‌ను చూపించినట్టు తెలిపింది. పెద్దలతో పోలిస్తే.. పిల్లలలో అత్యుత్తమ యాంటీబాడీలు పెరిగినట్టు భారత్ బయోటెక్ తెలిపింది. ఈ టీకా తీసుకున్న పిల్లల్లో ఇంజెక్షన్ వేసిన చోట నొప్పితో పాటు తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ లేదా మయోకార్డిటిస్ లేదా రక్తం గడ్డకట్టడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ట్రయల్స్ లో పాల్గొన్న వారిలో 374 మంది వాలంటీర్లకు తేలికపాటి లేదా మితమైన తీవ్రత లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 78.6శాతం మందిలో మాత్రం ఒక్కరోజులోనే లక్షణాలు తగ్గిపోయాయి.

మల్టీ-సెంటర్ పీడియాట్రిక్ ట్రయల్స్ 2-18 ఏళ్ల వయస్సు గల 525 మంది వాలంటీర్లపై జూన్-సెప్టెంబర్ 2021 మధ్య మూడు కోహోర్ట్‌లలో నిర్వహించింది.12ఏళ్ల నుంచి 18ఏళ్ల వయస్సు గల 176 మంది వాలంటీర్లు, 6ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయస్సు(175) మంది, 2-6 సంవత్సరాల (175)మంది వాలంటీర్లు పాల్గొన్నారు. తద్వారా.. 2 ఏళ్లు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై అధ్యయనం చేసి డేటాను రూపొందించిన ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌గా Covaxin నిలిచింది. పీడియాట్రిక్ జనాభా నుంచి క్లినికల్ ట్రయల్ డేటా చాలా ప్రోత్సాహకరంగా ఉందని భారత్ బయోటెక్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు.

టీకా, భద్రత పిల్లలకు కీలకమని, కోవాక్సిన్ పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంచుతుందనే నిరూపితమైందని చెప్పారు. పెద్దలు, పిల్లలకు సురక్షితమైన, సమర్థవంతమైన కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలనే తమ లక్ష్యాన్ని ఇప్పుడు సాధించామని ఆయన తెలిపారు. భారత్ బయోటెక్.. అక్టోబర్ 2021లో ట్రయల్స్ డేటాను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌ (CDSCO)కు సమర్పించింది. డిసెంబర్ 25న 12-18 ఏళ్ల వయస్సు గల పిల్లలకు డ్రగ్ రెగ్యులేటర్ నుంచి అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ ఆమోదాన్ని పొందిన సంగతి తెలిసిందే.

Read Also : AP Covid – 19 : ఏపీలో కరోనా..130 కొత్త కేసులు..ఒకరి మృతి