Brain Active : మెదడు చురుకుగా, నిర్ణయాలు వేగంగా.. అలాగైతే వీటిని ఆహారంలో చేర్చుకోండి!

రోజుకి మూడు లేదా నాలుగు సార్లు తక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకొనే అలవాటు మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉడికించిన కూరగాయలు, పొట్టు ఎక్కువ తియ్యని బియ్యం, చిరుధాన్యాలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి.

Brain Active : మెదడు చురుకుగా, నిర్ణయాలు వేగంగా.. అలాగైతే వీటిని ఆహారంలో చేర్చుకోండి!

Brain active

Brain Active : శరీర బరువులో మెదడు బరువు రెండు శాతమే ఉన్నప్పటికీ గుండె నుంచి సరఫరా అయ్యే రక్తం 15శాతం మెదడుకు వెళ్లాల్సిందే. మనం పీల్చే ప్రాణవాయువులో 20 శాతం మెదడు స్వీకరిస్తుంది. మన కోసం తయారయ్యే శక్తిలో 5 శాతం మెదడు ఉపయోగించుకుంటుంది. మెదడు చిన్నదే కావచ్చు కానీ అది నిర్వహించే విధులు ప్రకారం చూస్తే మాత్రం తన ప్రతి కదలిక ప్రతి ఆలోచన చాలా కీలకమనే చెప్పాలి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

మెదడు పనితీరు మెరుగుపడేందుకు;

మెదడుకు కావాల్సిన వాటిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఖనిజ లవణాలు కీలకమైనవి. బ్రౌన్‌రైస్‌, పిండి పదార్థాలుండే కూరగాయలు, చిలగడ దుంపల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. తక్షణం శక్తిని అందిస్తాయి. చికెన్‌, మాంసాహారం, చేప, గుడ్లు, చిక్కుడు, గింజలు, విత్తనాలు, ఫ్లాక్స్‌ సీడ్స్‌ వంటి వాటిలోని ఫాటీయాసిడ్స్‌ మెదడు, నరాల వ్యవస్థ పనితీరును మెరుగ్గా ఉంచి, ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తాయి.

బాదాం, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు,వాల్ నట్స్ లో ఉండే పాలీఫినాల్స్ మెదడులోని న్యూరాన్స్ ను,బ్రెయిన్ మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల మెమరీ పవర్  మెరుగుపరుచుకునే శక్తి వస్తుంది. అవిసె గింజలను రోజూ తీసుకుంటే బ్రెయిన్ ఆలోచనాశక్తి ని పెంచడానికి చాలా ఉపయోగపడతాయి.

రోజుకి మూడు లేదా నాలుగు సార్లు తక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకొనే అలవాటు మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉడికించిన కూరగాయలు, పొట్టు ఎక్కువ తియ్యని బియ్యం, చిరుధాన్యాలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే ఆకుకూరలు, ప్రొబయోటిక్స్‌ ఉండే పెరుగు మీ ఆహారంలో తప్పక ఉండేలా జాగ్రత్త పడాలి. రోజుకి నాలుగైదు లీటర్ల నీటిని తీసుకోవాలి. వ్యాయామాలు, యోగా, ధ్యానానికి కచ్చితంగా సమయాన్ని కేటాయించుకోవాలి. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లేలా జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేలా అన్ని చర్యలు తీసుకోవటం ద్వారా మెదడును నిరంతరం చురుకుగా ఉంచుకోవచ్చు.

చక్కెర, కాఫీ, వేపుళ్లు, జంక్‌ఫుడ్‌, శీతలపానీయాలు, చిప్స్‌ వంటివి మంచి బ్యాక్టీరియా ఉత్పత్తికి తోడ్పడవు. శక్తి స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడి ఆందోళన, ఒత్తిడికి కారణమవుతాయి. ఓట్స్ మరియు చిరు ధాన్యాల తో కలిపి తీసుకోవడంవల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడుకణాలు శక్తిని గ్లూకోజ్ రూపంలో మాత్రమే తీసుకుంటాయి.సమయానికి ఆహారం తీసుకుంటే అది గ్లూకోజ్ గా మారి మెదడుకు అందించడంవల్ల మెదడు చురుగ్గా పని చేయటానికి అవకాశం ఉంటుంది.