Eating Idli : ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ తింటే బరువు తగ్గవచ్చా?

ఇడ్లీలు చాలా తేలికగా జీర్ణమవుతాయి. పులియబెట్టిన అన్ని ఆహారాలు సహజంగా సులభంగా జీర్ణమవుతాయి. పులియబెట్టిన ఆహారాలు మన శరీరంలోని ఖనిజాలు, విటమిన్లు బాగా విచ్ఛిన్నం చేస్తాయి, ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది.

Eating Idli : ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ తింటే బరువు తగ్గవచ్చా?

Eating Idli

Eating Idli : ఇడ్లీ నిస్సందేహంగా చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ గా చెప్పవచ్చు. దక్షిణ భారతీయులు ఉదయం టిఫిన్ గా కొబ్బరి చెట్నీ, సాంబారు రుచితో ఇడ్లీలను లాగించేస్తుంటారు. ఉడికించిన, ఉబ్బిన సులభంగా జీర్ణమయ్యే ఇడ్లీ ఆరోగ్యం వంతులకు, ఫిట్‌నెస్ ఔత్సాహికులకు ఇష్టమైనది. రుచికరమైనదిగా ఉండటమే కాకుండా, ఇడ్లీ నిజానికి అత్యంత ఆరోగ్యకరమైన భారతీయ స్నాక్స్‌లో ఒకటి. బరువును తగ్గించటంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఇది ఉత్తమమైన ఆహారాలలో ఒకటిగా నిపుణులు సూచిస్తున్నారు.

ఇడ్లీలు ఆవిరి మీద వండుతారు. బజ్జీలు, పునుగుల్లా వాటిని కొవ్వును పెంచే నూనెలో వేయించరు. ఇడ్లీలో కొవ్వులు పెంచే కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇడ్లీలను తీసుకోవటం ద్వారా తక్కుమొత్తంలో కేలరీలు శరీరానికి అందుతాయి. సాంప్రదాయ ఇడ్లీ పిండిలో బియ్యం ఒక ముఖ్యమైన భాగంగా చేస్తారు. పిండి పదార్థాలు తక్కువగా ఉన్నట్లయితే, బియ్యం మోతాదును తగ్గించవచ్చు మినపప్పు కంటెంట్‌ను పెంచవచ్చు. పిండిలో కొన్ని కూరగాయలు, ఆరోగ్యకరమైన మసాలాలు కూడా వేసుకోవచ్చు.

ఇడ్లీలు జీర్ణక్రియకు, ప్రేగులకు మంచివి ;

ఇడ్లీలు చాలా తేలికగా జీర్ణమవుతాయి. పులియబెట్టిన అన్ని ఆహారాలు సహజంగా సులభంగా జీర్ణమవుతాయి. పులియబెట్టిన ఆహారాలు మన శరీరంలోని ఖనిజాలు, విటమిన్లు బాగా విచ్ఛిన్నం చేస్తాయి, ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. జీర్ణానికి సహాయపడటమే కాకుండా, పులియబెట్టిన ఆహారాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా దీర్ఘాయువు ,మంచి ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ప్రేగులలోని PH స్ధాయిలను బ్యాలెన్స్‌ చేస్తుంది. ఇడ్లీలలో ఫైబర్ మరియు ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఎక్కువసేపు తృప్తిగా ఉండటానికి సహాయపడుతుంది, దీంతో ఎక్కువ తినకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా, ఫైబర్ మంచి జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది, ఇది బరువు తగ్గడానికి కీలకమైనది.

అలాగే ఓట్స్ తో కూడా ఇడ్లీలు తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఇలా ఓట్స్ తో తయారు చేసిన ఇడ్లీలతో బరువును సులభంగా తగ్గవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోలేరు. ఎక్కువసేపు ఆకలి అనిపించదు. బరువు తగ్గాలన్న ప్రయత్నంలో ఉన్నవారు అల్పాహారంగా ఇడ్లీ తినటం మంచిదే అయినప్పటికీ శరీరానికి ఎన్ని కేలరీలు అందుతున్నాయో చూసుకుంటూ వాటి సంఖ్యను పరిమితం చేసుకోవాలి. రుచిగా ఉన్నాయి కదా అని అదేపనిగా ఇడ్లీలు లాగిస్తే మాత్రం తిరిగి బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది.