కరోనాపై పోరాడే ‘ప్రొటీన్’ వచ్చేసింది.. ట్రీట్‌మెంట్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు!

  • Published By: sreehari ,Published On : July 20, 2020 / 06:48 PM IST
కరోనాపై పోరాడే ‘ప్రొటీన్’ వచ్చేసింది.. ట్రీట్‌మెంట్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు!

కరోనాపై పోరాడే ప్రోటీన్ వచ్చేసింది.. క్లినికల్ ట్రయల్ ప్రాధమిక ఫలితాల్లో యూకే సంస్థ ఈ ప్రోటీన్ ను అభివృద్ధి చేసింది. కోవిడ్ -19 కొత్త చికిత్సలో ఇంటెన్సివ్ కేర్ (ICU) అవసరమయ్యే రోగుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుందని అభివృద్ధి చేసిన UK సంస్థ తెలిపింది. సౌతాంప్టన్ ఆధారిత బయోటెక్ Synairgen నుంచి ఇంటర్ఫెరాన్ బీటా అనే ప్రోటీన్‌ను కరోనా చికిత్సలో ఉపయోగిస్తోంది.

సాధారణంగా వైరల్ ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు శరీరంలో ఈ ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. నెబ్యులైజర్‌ ద్వారా కరోనావైరస్ రోగుల ఊపిరితిత్తులలోకి ఈ ప్రోటీన్ నేరుగా పీల్చుకునేలా చేస్తుంది. ఆస్పత్రిలో కరోనా సోకిన రోగిలో వెంటిలేషన్ 79శాతం అవసరమవుతోందని ప్రాధమిక పరిశోధనల్లో తేలింది. అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం రెండు, మూడు రెట్లు ఎక్కువ అని Synairgen పేర్కొన్నారు.

ఇదో కొత్త గేమ్ ఛేంజర్ :
కరోనా చికిత్స తీసుకున్న రోగుల్లో ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలను తగ్గించినట్టు ఈ ట్రయల్ సూచించింది. ఆస్పత్రిలో రోగులు గడిపిన సగటు సమయం మూడవ వంతు తగ్గినట్లు చెబుతోంది. కొత్త ఔషధాన్ని తీసుకున్న వారిలో సగటున తొమ్మిది రోజుల నుంచి ఆరు రోజులకు తగ్గిపోయింది.
Coronavirus Protein treatment trial a breakthrough

కోవిడ్ -19 చికిత్స కోసం తొమ్మిది UK ఆస్పత్రుల్లో చేరిన 101 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. వీరిలో సగం మందికి ఔషధం ఇచ్చారు. మిగిలిన సగం మందికి ప్లేసిబోను ఇచ్చారు. కరోనావైరస్ చికిత్సలో చాలా మంచి పురోగతి అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త చికిత్స ‘గేమ్ ఛేంజర్’ అవుతుందని భావిస్తున్నట్టు ట్రయల్ ఇన్‌చార్జి శాస్త్రవేత్త టామ్ విల్కిన్సన్ చెప్పారు.

ఆసుపత్రిలో చేరిన కోవిడ్ -19 రోగుల చికిత్సలో పెద్ద పురోగతి అని ఆయన అభివర్ణించారు. రాబోయే రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెడికల్ రెగ్యులేటర్లకు కంపెనీ తన ఫలితాలను అందిస్తుందని అంటున్నారు.

కరోనావైరస్ చికిత్సలను ఆమోదించడానికి వీలైనంత వేగంగా పనిచేస్తుందని చెప్పారు. యాంటీ-వైరల్ డ్రగ్ remdesivir మే నెలలోనే రావడంతో దీనికి అత్యవసర అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మంది రోగులకు చికిత్స అందించేలా అనుమతులు రావొచ్చు. వచ్చే చలికాలం నాటికి Synairgen నెలకు కొన్ని 100,000 మోతాదులను అందించగలదని ఆశిస్తున్నానని Richard Marsden చెప్పారు.

ఇదేలా పనిచేస్తుందంటే? :
వైరస్ నుంచి శరీరాన్ని ఇంటర్ఫెరాన్ బీటా ప్రోటీన్ రక్షిస్తుంది. కరోనావైరస్ రోగనిరోధక వ్యవస్థల ఉత్పత్తిని ఈ ప్రోటీన్ అణిచివేస్తుంది. కొత్త ఔషధం ఇంటర్ఫెరాన్ బీటాను నెబ్యులైజర్ ద్వారా నేరుగా శ్వాసకోస మార్గాల్లోకి చేరుతుంది. ఇది ప్రోటీన్‌ను ఏరోసోల్‌గా చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థలు బలహీనంగా ఉన్న రోగులలో ఊపిరితిత్తులలోని ప్రోటీన్ యాంటీ-వైరల్ రెస్పాండ్‌ను ప్రేరేపిస్తుంది.

ఇంటర్ఫెరాన్ బీటాను సాధారణంగా మల్టిపుల్ స్క్లెరోసిస్ చికిత్సలో ఉపయోగిస్తారు. Synairgen నిర్వహించిన గత క్లినికల్ ట్రయల్స్‌లో రోగనిరోధకతను పెంచుతుందని గుర్తించారు. ఉబ్బసం, ఇతర దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యల నుంచి కూడా కోలుకునేలా చేస్తుందని అంటోంది కంపెనీ.
షెఫీల్డ్ యూనివర్శిటిలోని నిపుణుడు ప్రొఫెసర్ స్టీవ్ గుడాక్రే చెప్పిన ప్రకారం.. ఈ ఫలితాలు అర్థమయ్యేవి కావు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ట్రయల్ ప్రోటోకాల్ అవసరమన్నారు. కేవలం 100 మందికి పైగా ఈ ట్రయల్ లో పాల్గొ్న్నారు. వ్యాధి తీవ్రతలో 79శాతం తగ్గిస్తుందని విశ్వసిస్తున్నట్టు ఆయన తెలిపారు.