Vomiting Bug : కరోనా, మంకీపాక్స్.. ఇప్పుడు.. ‘నోరోవైరస్..’ వణుకు పుట్టిస్తోంది!

ఒకవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతుంటే.. మంకీ బీ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు వీటికి తోడు మరో కొత్త నోరావైరస్.. వణుకుపుట్టిస్తోంది.

Vomiting Bug : కరోనా, మంకీపాక్స్.. ఇప్పుడు.. ‘నోరోవైరస్..’ వణుకు పుట్టిస్తోంది!

Highly Infectious' Norovirus Is Spewing Fear In Uk

Vomiting Bug : ప్రపంచాన్ని వైరస్ మహమ్మారులు చుట్టుముట్టేస్తున్నాయి. మానవాళి మనుగడ సాగించలేని పరిస్థితి ఎదురవుతోంది. ఒకవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతుంటే.. మంకీ బీ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు వీటికి తోడు మరో కొత్త నోరావైరస్.. వణుకుపుట్టిస్తోంది.

చైనాలో మంకీ బీ వైరస్ కారణంగా ఒక మరణం నమోదైందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో.. యూకేలో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది. అదే.. నోరావైరస్.. (Norovirus).. దీన్ని వామిటింగ్ బగ్ (Vomting Bug) అని కూడా పిలుస్తారు. ఇంగ్లండ్ వ్యాప్తంగా ఈ నోరోవైర‌స్ కేసులు నమోదవుతున్నాయని ప‌బ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (PHE) ఒక ప్రకటనలో వెల్లడించింది.

నోరోవైర‌స్‌ అంటే :
నోరో వైర‌స్‌.. ఆహారం ద్వారా వ్యాపిస్తోందని సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ (CDC) పేర్కొంది. ఈ నోరోవైర‌స్‌నే స్ట‌మ‌క్ ఫ్లూగా పిలుస్తుంటారు. ఫుడ్ పాయిజ‌నింగ్,  స్ట‌మ‌క్ బ‌గ్ అంటారు..

ల‌క్ష‌ణాలేంటి?
ఈ వైర‌స్ సోకితే.. 12 నుంచి 48 గంట‌ల్లో తీవ్ర‌మైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ ల‌క్ష‌ణాలు బయటపడతాయి. ఒక‌టి నుంచి మూడు రోజులు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైర‌స్ సోకితే డ‌యేరియా, క‌డుపు నొప్పి, వికారం, వాంతులు, జ్వ‌రం, త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కొంద‌రికి నోరోవైర‌స్ సోకినా ఎలాంటి అనారోగ్య ల‌క్ష‌ణాలు కనిపించవట..

ప్ర‌మాద‌క‌రమేనా?
ఈ వైర‌స్ బారిన పడ్డవారిలో మ‌లం, వాంతిలో నోరోవైర‌స్ ఉంటుంది. ఏ కొంచెం శరీరంలోకి వెళ్లినా వైర‌స్ సోకుతుంది. క‌లుషిత‌మైన నీళ్లు, ఆహారాన్ని సిద్ధం చేసే ముందు స‌రిగా క‌డ‌గ‌క‌పోతే.. అక్కడ ఈ వైర‌స్ విజృంభించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వ్య‌క్తులు వంద‌ల కోట్ల నోరోవైర‌స్ అణువుల‌ను కలిగి ఉంటారు. వీరి ద్వారా ఇత‌ర వ్య‌క్తుల‌కు సోకే ప్రమాదం లేకపోలేదు.

ఎలా సోకుతుందంటే? :
క‌లుషిత‌మైన ఆహారం, ద్ర‌వాల‌ ద్వారా ఈ వైర‌స్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన ఏదైనా వ‌స్తువు, ఉప‌రిత‌లాన్ని తాకి… అదే చేతితో నోటిని తాకిన‌ప్పుడు వైర‌స్‌ వ్యాపిస్తుంది. ఈ వైర‌స్ సోకిన వ్య‌క్తితో ఆహారం షేర్ చేసుకున్నా కూడా ఈ వ్యాధి సోకుతుంది. అలాగే వారు వాడిన పాత్ర‌ల‌ను వాడ‌టం వ‌ల్ల కూడా ఈ వైర‌స్ బారిన ప‌డ‌వ‌చ్చు. బావిలోని క‌లుషిత నీటిని తాగినా వైర‌స్ వ్యాపిస్తుంది.

గుర్తించడం ఎలానంటే? :
వైరస్ లక్షణాలను బట్టి గుర్తించవచ్చు. మ‌లాన్ని ప‌రీక్షించ‌డం ద్వారా కూడా వైర‌స్ ను గుర్తించే అవకాశం ఉంది.  ఇతర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా లేదా రోగ నిరోధ‌క‌శ‌క్తి త‌క్కువగా ఉన్నవారి మ‌లాన్ని పరీక్షించడం ద్వారా తెలుసుకోవచ్చు.

చికిత్స ఎలానంటే? :
నోరోవైర‌స్ సోకితే.. ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకోవచ్చు. వృద్ధులు, చిన్న పిల్ల‌లు, అనారోగ్య స‌మ‌స్య‌లున్న వాళ్లలో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. వీళ్ల‌కు చికిత్స త‌ప్ప‌నిస‌రిగా అవసరం. ఒక్కోసారి ఆస్పత్రిలోనూ అడ్మిట్ అయ్యే అవసరం పడొచ్చు. ఈ వైర‌స్ బారిన పడితే వాళ్లకు ఒక‌టి నుంచి మూడు రోజుల్లో నయమైపోవచ్చు.