Dengue : డెంగ్యూతో బాధపడేవారు ఈ ఆహారాల జోలికి వెళ్లొద్దు!

డెంగ్యూతో బాధపడే సమయంలో చాలా మందికి ఎలాంటి ఆహారాలు తినకూడదో అవగాహన ఉండదు. దీని వల్ల తినకూడని ఆహారాలు తీసుకోవటం వల్ల సమస్య మరింత జఠిలంగా మారే అవకాశాలు ఉంటాయి. కొన్ని రకాల ఆహారాలను డెంగ్యూతో బాధపడుతున్న సమయంలో తీసుకోకపోవటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Dengue : డెంగ్యూతో బాధపడేవారు ఈ ఆహారాల జోలికి వెళ్లొద్దు!

Dengue sufferers should not go for these foods

Dengue : డెంగ్యూ జ్వరం అనేది డెంగ్యూ వైరస్ వల్ల దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. శరీరంలోకి ప్రవేశించిన పద్నాలుగు రోజుల తర్వాత లక్షణాలు ప్రారంభమవుతాయి. అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాలు మరియు కీళ్ల నొప్పులు మరియు చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగితే రక్తస్రావం, ప్లేట్‌లెట్‌లు తగ్గటం, రక్త ప్లాస్మా లీకేజ్, హెపటైటిస్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇదిలా ఉంటే డెంగ్యూతో బాధపడే సమయంలో చాలా మందికి ఎలాంటి ఆహారాలు తినకూడదో అవగాహన ఉండదు. దీని వల్ల తినకూడని ఆహారాలు తీసుకోవటం వల్ల సమస్య మరింత జఠిలంగా మారే అవకాశాలు ఉంటాయి. కొన్ని రకాల ఆహారాలను డెంగ్యూతో బాధపడుతున్న సమయంలో తీసుకోకపోవటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

నూనెతో తయారైన ఆహరాలు ; జిడ్డుగల ఆహారాన్ని నివారించడం మంచిది. తేలికపాటి ఆహారాన్ని ఎంచుకోవడం ఉత్తమం. ఆయిలీ ఫుడ్‌లో అధిక కొవ్వు ఉంటుంది, ఇది అధిక రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్‌కు దారితీస్తుంది.

స్పైసీ ఆహారం ; డెంగ్యూ రోగులకు స్పైసీ ఫుడ్ తీసుకోవటం మంచిదికాదు. ఇది కడుపులో యాసిడ్ పెరగటానికి కారణమౌతుంది. దీనివల్ల అల్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మసాలా వెల్లుల్లి అధిక వినియోగాన్ని నివారించుకోవాలి.

కెఫిన్ కలిగిన పానీయాలు ; కూల్ డ్రింక్స్ వంటి ద్రవాలను తీసుకోకపోవటమే మంచిది. కెఫిన్ కలిగిన పానీయాలకు దూరంగా ఉండాలి. ఈ పానీయాలు వేగవంతమైన హృదయ స్పందన, అలసట, కండరాల విచ్ఛిన్నానికి కారణమవుతాయి. అలాగే టీ లేదా కాఫీలను మానేయటం మంచిది.

మాంసాహారం వద్దు ; డెంగ్యూతో బాధపడుతున్న వారు మాంసాహారం తీసుకోవటం వల్ల హెపటైటిస్ లేదా అజీర్తి సమస్యలు వస్తాయి. కాబట్టి నాన్ వెజ్ కు దూరంగా ఉండాలి.