Salads : బరువు తగ్గేందుకు తీసుకునే సలాడ్స్ విషయంలో పొరపాట్లు వద్దు! |Do not make mistakes in the case of salads taken to lose weight!

Salads : బరువు తగ్గేందుకు తీసుకునే సలాడ్స్ విషయంలో పొరపాట్లు వద్దు!

సలాడ్స్ రుచిగా ఉండాలి, చూసేందుకు బాగుండాలి అన్న ఉద్దేశంతో సలాడ్స్​పై వివిధ పదార్ధాలతో అందంగా అలంకరించటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల అదనపు ట్రాన్స్ ఫ్యాట్స్​ను శరీరానికి అందించిన వారమౌతాం.

Salads : బరువు తగ్గేందుకు తీసుకునే సలాడ్స్ విషయంలో పొరపాట్లు వద్దు!

Salads : ఇటీవలి కాలంలో బరువు సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య అధికమౌతుంది. అధిక బరువును తగ్గించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటుంటారు. బరువు తగ్గాలనుకునే వ్యక్తులు ప్రోటీన్, పోషకాలతో కూడిన ఆహారాన్ని స్వీకరించాలని నిపుణులు సూచిస్తుంటారు. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం బరువు తగ్గడానికి శక్తిని అందించటానికి,పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచటానికి సహాయపడుతుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు ఉన్నవారు సలాడ్స్​ను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.

సలాడ్ లు తయారు చేసే విషయంలో చేసే పొరపాట్ల కారణంగా బరువు తగ్గటానికి బదులు బరువు పెరుగుతున్న పరిస్ధితి చాలా మందిలో కనిపిస్తుంది. సలాడ్ లు తయారు చేసే సమయంలో రుచికోసం వాటిలో వివిధ రకాల పదార్ధాలను కలుపుతున్నారు. వీటి వల్ల శరీరంలోకి అదనపు కేలరీలు చేరిపోయి బరువు పెరగటానికి దారి తీస్తుంది. సలాడ్ లకు అనారోగ్యకరమైన పదార్థాలు జోడిస్తే కేలరీలు పెరిగుతాయి. సలాడ్‌లలో ఫైబర్, విటమిన్‌లను ఉండేలా చూసుకోవాలి.

సలాడ్స్ రుచిగా ఉండాలి, చూసేందుకు బాగుండాలి అన్న ఉద్దేశంతో సలాడ్స్​పై వివిధ పదార్ధాలతో అందంగా అలంకరించటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల అదనపు ట్రాన్స్ ఫ్యాట్స్​ను శరీరానికి అందించిన వారమౌతాం. వెన్న, చీజ్ వంటి పాల ఉత్పత్తులను వాడరాదు. ఇవి అనారోగ్యకరమైన కొవ్వులు, అదనపు కార్బోహైడ్రేట్లను శరీరానికి అందిస్తాయి. కాబట్టి వాటిని ఎట్టిపరిస్ధితుల్లో వాడకుండా ఉండటమే మంచిది. ప్రోటీన్ కోసం సలాడ్‌లలో చాలా మంది మాంసాన్నిఉపయోగిస్తారు. కొవ్వు పదార్ధాలు ఆరోగ్యానికి హానికలిగిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ రెడ్ మీట్ ఏమాత్రం సహేతుకమైనదికాదు.

ప్రొటీన్స్ కోసం, సలాడ్స్ అలంకరణ కోసం కావాలంటే పప్పుధాన్యాలను ఉపయోగించవచ్చు. డ్రై ఫ్రూట్స్, నట్స్‌ సలాడ్స్​కు అపారమైన ఫైబర్‌ను అందిస్తాయి. పప్పులు, మొలకలు, బీన్స్‌ వంటి వాటిలో మంచి ప్రొటీన్లు ఉంటాయి. పండ్లు, తేనెతో సహా సహజ తీపి పదార్థాలు ఉపయోగించాలి. ఎక్కువగా పచ్చిగా ఉండే కూరగాయలను సలాడ్స్​లో చేర్చుకోవాలి. ఇలా చేస్తే సులభంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

×