Almonds And Raisins : నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష ప్రతిరోజు తింటే?…

ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్స్ అధికంగా ఉంటాయి . అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాదు ఎండు ద్రాక్షలో అనేచురల్ షుగర్స్ అత్యద్భుతంగా ఉన్నాయి.

Almonds And Raisins : నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష ప్రతిరోజు తింటే?…

Almonds (1)

Almonds And Raisins : శరీరానికి రోజు మొత్తంలో మంచి శక్తిని ఇచ్చే వాటిలో రోజు ఉదయం మనం తీసుకునే అల్పాహారం చాలా ముఖ్యమైనది. అలాంటి ఆహారం విషయంలో మనం సరైనా నిర్ణయం తీసుకుని శరీరానికి శక్తినిచ్చే వాటిని మాత్రమే ఉదయం బ్రేక్ ఫాస్ట్ క్రింద తీసుకోవాల్సి ఉంది. అలాంటి వాటిలో తృణధాన్యాలు, ప్రొటీన్లు, పాల ఉత్పత్తులు, గింజలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి.

ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్షలను తీసుకోవటం వల్ల రోజు మొత్తం శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. ఇలా చేయటం వల్ల అనారోగ్య పరిస్ధితులు దరి చేరవు. బాదం జ్ఞాపకశక్తికి మంచిది. నానబెట్టిన బాదం , ఎండు ద్రాక్షలను కలిపి తినటం వల్ల అనే ప్రయోజనాలు ఉన్నట్లు ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ దీక్షా భావ్ సర్ తెలిపారు.

బాదం నానబెట్టి తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ;

* బాదం, ఎండు ద్రాక్షాలను ఉదయం తినటం వల్ల రోజంతా ఉత్సాహంగా, చురుకుదనంతో ఉండేందుకు అవకాశం ఉంటుంది.

* బాగా తీపిగా , ఉప్పగా ఉండే ఆహారాలను తినాలని చాలా మంది అనుకుంటుంటారు. అలాంటి వారికి ఆకోరికలు తగ్గుతాయి.

* జీర్ణశక్తిని మెరుగుపర్చటానికి బాగా ఉపయోగపడతాయి.

* పీరియడ్స్ సక్రమంగా, సకాలంలో వచ్చేలా చేయటంలో సహాయపడుతాయి.

* బాదం జ్ఞాపకశక్తికి బాగా ఉపయోగపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

* రక్తపోటు, కొలెస్ట్రాల్ ను తగ్గించటం వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తాయి.

* గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

* నానబెట్టిన బాదం లో ఉన్న ఫ్లేవనాయిడ్స్ ట్యూమర్ ని పెరగనివ్వవు.

* గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించి రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.

* పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేసే ఫోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంది.

బాదం పప్పులో టానిన్ అనే సమ్మెళనం ఉంది. ఇది పోషకాల శోషణను నిరోధిస్తుంది. బాదం పప్పును నానబెట్టిన తర్వాత టానిన్ తొలగించబడుతుంది. తద్వారా అవి పోషకాలను విడుదల చేస్తాయి. బాదం పప్పును నానబెట్టి పొట్టు తీయడం వల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. బాదం పప్పును నానబెట్టటం వల్ల జీర్ణక్రియకు ఉపయోగపడే లైపేస్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది.

బాదంలో పోషకాలు, ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫాస్పరస్ వంటి అద్భుతమైన మూలాలు ఉంటాయి. బరువు తగ్గటం, ఎముకల బలం, మానసిక స్ధితిని మెరుగుపరచడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించటం, క్యాన్సర్ , మదుమేహం వంటి అనేక రుగ్మతలకు ఇవి చక్కని ప్రయోజనకారిగా పనిచేస్తాయి.

బాదం ఒమేగా 3, విటమిన్ ఇ, ప్రొటీన్, పీచుతో నిండి ఉంటుంది. దీని పోషకాహార విలువలని బట్టి సూపర్ ఫుడ్ అనొచ్చు. ఇందులో ఉన్న ప్రొటీన్ కారణంగా తొందరగా ఆకలి వేయదు. మెగ్నీషియం వల్ల ఎముకలు బలపడతాయి, ఇంకా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.

కొన్ని బాదం పప్పులు తీసుకుని అరకప్పు నీటిలో నానబెట్టండి. మూత పెట్టి ఎనిమిదిగంటలపాటూ అలాగే ఉంచెయ్యండి. తరవాత నీరు వంపేసి, తొక్క తీసేసి ప్లాస్టిక్ డబ్బాలో వేసి మూత పెట్టెయ్యండి. రాత్రి నానబెట్టి.. ఉదయాన్నే వాటిని తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఎండు ద్రాక్షను నానబెట్టి తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ;

ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్స్ అధికంగా ఉంటాయి . అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాదు ఎండు ద్రాక్షలో అనేచురల్ షుగర్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. ఎండు ద్రాక్షలో కూడా వివిధ రకాలున్నాయి. వాటిలో గోల్డెన్, గ్రీన్ మరియు బ్లాక్ కలర్స్ ఇలా వివిధ రకాలుగా ఉన్నాయి.

వివిధ రకాల డిష్ లలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. అంతే కాదు, కొన్ని హెల్త్ టానిక్స్ లో కూడా ఎండు ద్రాక్షరసాన్ని వినియోగిస్తుంటారు. అయితే ఎండు ద్రాక్షలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని మితంగా తీసుకోవడం మంచిది.

ఎండు ద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచడంలో దోహదపడుతుంది. ఒక గ్లాసు నీటిలో `10 నుండి 12 ఎండు ద్రాక్షలను వేసి, రాత్రంతా నానబెట్టాలి. వీటిని మిక్సీలో పేస్ట్ చేసి ఉదయం నేరుగా పరగడుపున తీసుకోవడం వల్ల జీర్ణశక్తిపెరుగుతుంది.

ఎండు ద్రాక్షలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటి లెవల్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వింటర్ సీజన్ లో వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా మరియు ఇతర ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది.

ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బ్యాడ్ బ్రీత్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో ఎండు ద్రాక్ష బాగా సహాయపడుతుంది.

ఎండు ద్రాక్షలో క్యాల్షియం మరియు మైక్రో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి బోన్ హెల్త్ ను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. ఎండు ద్రాక్షలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని నీటిలో నానబెట్టి, ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల అనీమియా సమస్య ఉండదు.

శరీరంలో టాక్సిన్స్ ను నివారించడంలో ఎండు ద్రాక్ష గ్రేట్ గా సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.