Exercise Higher Antibodies : వ్యాక్సిన్ తర్వాత వ్యాయామం చేస్తే.. 50శాతానికి పైగా అధిక యాంటీబాడీలు పెరుగుతాయి!

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రతిరోజూ వ్యాయామం క్రమం తప్పకుండా చేసేవారిలో అధిక యాంటీబాడీలు తయారైనట్టు ఓ కొత్త అధ్యయనంలో తేలింది. దాదాపు 50శాతానికి పైగా అత్యధిక స్థాయిలో యాంటీబాడీలు పెరిగాయని గుర్తించారు.

Exercise Higher Antibodies : వ్యాక్సిన్ తర్వాత వ్యాయామం చేస్తే.. 50శాతానికి పైగా అధిక యాంటీబాడీలు పెరుగుతాయి!

Exercise Higher Antibodies

Exercise Higher Antibodies after Vaccine : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రతిరోజూ వ్యాయామం క్రమం తప్పకుండా చేసేవారిలో అధిక యాంటీబాడీలు తయారైనట్టు ఓ కొత్త అధ్యయనంలో తేలింది. దాదాపు 50శాతానికి పైగా అత్యధిక స్థాయిలో యాంటీబాడీలు పెరిగాయని గుర్తించారు. వ్యాయాయం చేయనివారికంటే వ్యాయామంలో యాక్టివ్ గా ఉండేవారిలోనే వ్యాక్సిన్ తాలూకూ యాంటీబాడీల శాతం భారీగా పెరిగినట్టు నిర్ధారించారు. గ్లాస్గో కాలెడోనియన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారానికి 5 రోజులు 30 నిమిషాల పాటు వ్యాయామం చేసేవారిలో అనారోగ్య ముప్పు తగ్గించడమే కాకుండా వ్యాధులతో మరణించే ముప్పు కూడా 37శాతం తగ్గినట్టు తేలింది.

Exercisess

ఈ అధ్యయన ఫలితాలు.. ప్రస్తుత కరోనా వ్యాప్తితో పాటు భవిష్యత్తు మహమ్మారులపై పోరాడేందుకు కూడా సాయపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు కరోనా మహమ్మారిని అంతం చేస్తాయనే నమ్మకం ఏర్పడింది. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు, కేసులు పెరిగిపోతునే ఉన్నాయి. ప్రపంచమంతాట రోగనిరోధక వ్యవస్థను ప్రేరిపించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రణలోకి తేవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Exercises

శారీరకంగా ఫిట్ ఉండటమే ఆరోగ్య రక్ష :
శారీరకంగా ఫిట్ నెస్ తో ఉండటం వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరవు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో వ్యాయామం అద్భుతంగా పనిచేస్తుంది. డైటింగ్, స్మోకింగ్ మానేయడం ద్వారా అనారోగ్యానికి గురికాకుండా కాపాడుకోవచ్చు. 2008 అధ్యయన ప్రకారం.. ఫిజికల్ యాక్టివిటీ లోపం కారణంగా ప్రతి ఏడాదిలో ఐదు మిలియన్లకు పైగా అకాల మరణాలు సంభవిస్తున్నాయని తేలింది. రోజువారీ శారీరక శ్రమ ద్వారా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. శారీరక వ్యాయంతో అనారోగ్య ముప్పు ను తగ్గించడమే కాకుండా వైరస్ ల బారిన పడకుండా రక్షిస్తుందని, అలాగే వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో టీకా సమర్థతను కూడా పెంచినట్టు తేలింది.

Exercise

అంతేకాదు.. న్యూమోనియా, కరోనాతో మరణించే ముప్పులను కూడా ఫిజికల్ యాక్టివిటీతో తగ్గించుకోవచ్చునని పరిశోధకులు గుర్తించారు. మొత్తం ఆరు అధ్యయనాల్లో 5లక్షల మందికి పైగా ఫిజికల్ యాక్టివిటీ గైడ్ లైన్స్ పాటించమని కోరగా.. వారంతా వారానికి 5 రోజుల పాటు 30 నిమిషాల చొప్పున వ్యాయామం చేశారు. వారిలో 37శాతం మంది వ్యాధులతో అనారోగ్య ముప్పు నుంచి బయటపడ్డారు. ఫిజికల్ యాక్టివిటీ ద్వారా స్థూలకాయం, డయాబెటిస్, శ్వాసపరమైన వ్యాధులు, గుండెజబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధుల బారినుంచి రక్షించుకోవచ్చునని అధ్యయనంలో రుజువైంది.