Memory Power : డైరీ రాయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందట

ఒకప్పుడు చాలామందికి డైరీ రాసే అలవాటు ఉంది. సోషల్ మీడియా మాయలో పడ్డాక డైరీనే మర్చిపోయారు. డైరీ రాయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Memory Power : డైరీ రాయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందట

Memory Power

Memory Power : ఒకప్పుడు డైరీ రాయడం అంటే చాలామంది ఇష్టపడేవారు. తమకు సంబంధించిన ప్రతి విషయం డైరీలో రాసుకునేవారు. ఇప్పుడంత డిజిటల్ యుగం. తమ దైనందిన జీవితంలో ప్రతి అంశం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి డైరీ రాయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందట.

డైరీ రాసే అలవాటు ఉండటం వల్ల కొన్ని అనుభవాలు, వాటివల్ల ఎదుర్కున్న ఫలితాలతో కొన్ని సర్దుబాట్లు చేసుకోగలుగుతాం. ముందు ఆ అనుభవాలను గుర్తు పెట్టుకోవాలంటే డైరీ రాయడం మంచి అలవాటు. నిద్రలో మనం చాలా విషయాల్ని మర్చిపోతుంటాం. అయితే డైరీ రాసే అలవాటు ఉన్నవారు నిద్రలో ఉన్నా సరే వారి జ్ఞాపకశక్తి బలంగా ఉంటుందట. అయితే డైరీ చాలామంది రాత్రివేళ పడుకునే ముందు రాస్తుంటారు. నిజానికి సాయంత్రం పూట డైరీ రాయడం మంచి సమయమట.

Wearing Socks : రాత్రి సమయంలో సాక్స్ ధరించి నిద్రపోయే అలవాటుందా ? అయితే ఇన్ఫెక్షన్స్ ముప్పు తప్పదంటున్న నిపుణులు

డైరీ రాయడం వల్ల ఆలోచనా విధానంలో కూడా మార్పు వస్తుంది. ఒకరోజు డైరీ రాసినపుడు ఉన్న భావోద్వేగాలు తరువాత రోజు ఉండవు. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు వాటి తాలుకూ ఎమోషన్స్ మన మీద ఎలా ప్రభావం చూపుతున్నాయో మన డైరీలోని రాతలు మన కళ్లకు కడతాయి. కొన్ని విషయాల్లో మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి కూడా సాయపడుతుంది.

చాలామంది జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మర్చిపోతుంటారు. డైరీ గతం మర్చిపోకుండా ఉంచుతుంది. డైరీ రాసే అలవాటు ఉన్నవారిలో భావోద్వేగాలు కంట్రోల్‌లో ఉంటాయి. మీరు చేసిన తప్పులు, ఒప్పులు నోట్ చేసుకోవడం ద్వారా మీలోని నిజాయితీ మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మనసు ఎటువంటి గందరగోళానికి గురవ్వకుండా ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కోగలిగే ధైర్యాన్నిస్తుంది.

Sleep Walking : నిద్రలో నడిచే అలవాటు అనారోగ్యసమస్యా!. ఎందుకిలా?

సెల్ ఫోన్లతో గంటలు గంటలు సోషల్ మీడియాలో సమయం గడపడం వల్ల మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాసేపు వాటిని పక్కన పెట్టి డైరీ రాయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని జ్ఞాపకాలను భద్రంగా దాచుకునే అవకాశం డైరీ రాయడం వల్లే సాధ్యమవుతుంది.