Beetroot : వృద్ధాప్య ఛాయలు తొలగించే బీట్‌రూట్ గుజ్జుతో ఫేస్ ప్యాక్!

బీట్‌రూట్‌ రసం, కమలా రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మకణాలను శుభ్రం చేస్తుంది.

Beetroot : వృద్ధాప్య ఛాయలు తొలగించే బీట్‌రూట్ గుజ్జుతో ఫేస్ ప్యాక్!

Beetroot Pulp

Beetroot : బీట్ రూట్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో రక్తం మోతాదును పెంచుకోవటానికి ఎంతగానో దోహదపడుతంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ A, విటమిన్ B6, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. బీట్ రూట్ జ్యూస్ ‌లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ లభిస్తాయి. అంతేకాకుండా బీట్‌రూట్‌లో చర్మ సౌందర్యానికి దోహదపడే గుణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

బీట్‌రూట్ గుజ్జులో నాలుగు చుక్కల బాదం నూనె, చెంచా ఆలివ్‌ నూనె వేసి ముఖానికి మర్దన చేసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే అరకప్పు పెరుగులో చిటికెడు పసుపూ, కొద్దిగా బీట్‌రూట్‌ గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక శుభ్రం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. చర్మం కాంతిమంతంగా ప్రకాశిస్తుంది.

బీట్‌రూట్‌ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. అరంగటపాటు అలాగే ఉంచాలి. అనంతరం చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

బీట్‌రూట్‌ రసం, కమలా రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మకణాలను శుభ్రం చేస్తుంది. అదే బీట్‌రూట్‌ రసంలో నిమ్మరసం కలిపి రాసుకుంటే పిగ్మెంటేషన్‌ సమస్య తొలగిపోతుంది.

బీట్ రూట్ జ్యూస్ ను చిక్కగా చేసి, ముడుతలున్న ప్రదేయంలో రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల ముడుతలు మాయం అవుతాయి. బీట్ రూట్ రసాన్ని పెదాల మీద అప్లై చేిస సున్నితమైన మసాజ్ ను చేయాలి. ఇలా రెగ్యులర్ గా రాత్రి సమయంలో చేస్తే పెదవులు అందంగా మృధువుగా మారతాయి.