Flax seed : బరువును తగ్గించటంలో సహాయపడే అవిసె గింజల కారం!

అవిసె గింజలు బరువును నియంత్రించడంలో ఉంచడంలో సహాయపడతాయి. అలాగే అవి గుండెకు కూడా ఉపయోగపడతాయి. అందుకే అవిసె గింజలను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Flax seed : బరువును తగ్గించటంలో సహాయపడే అవిసె గింజల కారం!

Flax seed :

Flax seed : అవిసె గింజలను మదనగింజలు, ఉలుసులు, అతశి అని కూడా అంటారు అవిసె గింజ ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేస్తాయి. అవిసె గింజలను పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర మోతాదు తగ్గుతుంది. అవిసె గింజలు బరువును నియంత్రించడంలో ఉంచడంలో సహాయపడతాయి. అలాగే అవి గుండెకు కూడా ఉపయోగపడతాయి. అందుకే అవిసె గింజలను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అవిసె గింజలను నేరుగా తినలేని వారు వాటిని వివిధ రూపాల్లో ఆహారంగా తీసుకోవచ్చు. అలాంటి వాటిలో ఎక్కువ మంది అవిసె గింజలను కారం పొడిగా తయారు చేసుకుని తీసుకుంటుంటారు.

అవిసె గింజలతో తయారైన కారపొడిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి మేలు చేసేలా అవిసె గింజలతో కారం పొడిని ఎలా తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

అవిసె గింజల కారం పొడి తయారీ ;

ముందుగా అవిసె గింజలు ఒక కప్పు, పల్లీలు అర కప్పు, మినపప్పు పావు కప్పు, నువ్వులు పావు కప్పు, ధనియాలు పావు కప్పు, మిరియాలు రెండు టీ స్పూన్స్, జీలకర్ర ఒక టీ స్పూన్, మెంతులు పావు టీ స్పూన్, ఎండుమిర్చి15 నుండి 18, కరివేపాకు ఒక కప్పు, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 15 తీసుకోవాలి.

ముందుగా ఒక కళాయిలో అవిసె గింజలు వేసి సన్నని మంటపై దోరగా వేయించాలి. వాటిని పక్కన పెట్టుకుని అదే కళాయిలో పల్లీలు కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మినపప్పు, నువ్వులు వేసి వేయించాలి. వీటిని కూడా ప్లేట్ పెట్టుకోవాలి తరువాత ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి అన్నీ కూడా చల్లారిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు, చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీంతో అవిసెగింజల కారం పొడి రెడీ అయినట్లే. దీనిని గాలి తగలకుండా గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల నెలరోజుల పాటు నిల్వవుంటుంది. ఈ కారాన్ని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు అవిసెగింజలను కారం రూపంలో రోజువారిగా తీసుకుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించటమైనది. కేవలం అవగాహాన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.