Heart Palpitations : గుండెల్లో దడ దడగా ఉంటుందా? ఈ పరిస్ధితి గుండె పోటుకు దారితీస్తుందా?

గుండె దడ నేరుగా గుండెపోటుతో సంబంధం కలిగి ఉండదు. ఎందుకంటే ఇది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలో అడ్డుపడటం వల్ల సంభవిస్తుంది. కొంత మందిలో గుండె వేగంగా కొట్టుకోవడం లేదా నెమ్మదిగా కొట్టుకోవడం లేదంటే కొన్ని కొన్ని సార్లు స్కిప్ అవడం లాంటివి జరుగుతాయి.

Heart Palpitations : గుండెల్లో దడ దడగా ఉంటుందా? ఈ పరిస్ధితి గుండె పోటుకు దారితీస్తుందా?

Heart palpitations? Can this condition lead to a heart attack?

Heart Palpitations : గుండె దడ వచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో గుండె కొట్టుకోవడం మానేస్తుంది. గుండె దడ ఉన్న వాళ్ళు ఇటువంటివి గమనిస్తుంటారు. ఒత్తిడి, యాంగ్జైటీ, వ్యాయామం ఎక్కువ చేయడం, కెఫిన్‌ని ఎక్కువగా తీసుకోవడం అలానే ఆల్కహాల్‌ని ఎక్కువగా తీసుకోవడం ఇలాంటి కారణాల వల్ల గుండె దడ వస్తుంది. అయితే కొన్ని కొన్ని సార్లు అబ్ నార్మల్ హార్ట్ బీట్ కారణంగా కూడా ఇటువంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గుండె దడ నేరుగా గుండెపోటుతో సంబంధం కలిగి ఉండదు. ఎందుకంటే ఇది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలో అడ్డుపడటం వల్ల సంభవిస్తుంది. కొంత మందిలో గుండె వేగంగా కొట్టుకోవడం లేదా నెమ్మదిగా కొట్టుకోవడం లేదంటే కొన్ని కొన్ని సార్లు స్కిప్ అవడం లాంటివి జరుగుతాయి. హార్ట్ ఎలక్ట్రికల్ సిస్టంలో మార్పు కారణంగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయి. హార్ట్ ఎలక్ట్రికల్ సిస్టం లో ఉండే ఈ మార్పులు వలన అబ్నార్మల్ హాట్ బిట్స్, రిథమ్స్ లో మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కార్డియోమయోపతి, గుండెపోటు, గుండె వైఫల్యం, అరిథ్మియా లేదా సక్రమంగా లేని హృదయ స్పందన, గుండె కవాట లోపాలు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు వంటి హానికరమైన పరిస్థితుల కారణంగా గుండె దడ వేగంగా లేదా నెమ్మదిగా కొట్టు కోవటం వంటివి చోటు చేసుకుంటాయి. ఈ పరిస్ధితుల్లో కొన్ని పూర్తి ఆరోగ్యం పైన ప్రభావం చూపవు. అయితే కొన్ని మాత్రం జీవితాన్నే ఇబ్బందిలోకి నెట్టి ప్రమాదకరంగా మార్చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జీవన శైలిలో మార్పులు:

ఆరోగ్యం సరిగా ఉండాలి అంటే మంచి జీవన విధానం చాలా అవసరం. మంచి జీవన విధానం ఉంటే ఆరోగ్యంగా ఉంటేందుకు అవకాశం ఉంటుంది. ఒత్తిడి, యాంగ్జైటీ లేకుండా చూసుకోవాలి. మెడిటేషన్, యోగ తో సులువుగా వాటిని దూరం చేసుకోవాలి. రోజులో కనీసం 20 నిమిషాలు అయినా మెడిటేషన్, యోగా లాంటివి చేయడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. మద్యపానం,ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. పూర్తిస్ధాయి ఆరోగ్యకరమైన జీవనం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.