Heart Burn : గుండెల్లో మంట, ఎసిడిటి….ఆహారంలో జాగ్రత్తలు

బార్లీజావ, సగ్గుబియ్యం జావ, సబ్బాగింజలు నీళ్ళు లాంటివి తాగితే ఎసిడిటీ త్వరగా తగ్గుతుంది. పాలు తాగితే ఎసిడిటీ పెరుగుతుంది.

Heart Burn : గుండెల్లో మంట, ఎసిడిటి….ఆహారంలో జాగ్రత్తలు

Heart Burn

Heart Burn : చాలా మందిలో ఆహారం తీసుకోగానే  పొట్టలో ఇబ్బంది ప్రారంభమౌతుంది. పొట్టలోంచి పుల్లని ద్రవం పైకి ఎగదట్టి గొంతు లోంచి ముక్కులోకి, గొంతులోకి ఎగజిమ్ము తుంది. గుండె దగ్గర బాధగా ఉంటుంది. గుండె బరువెక్కినట్లు అనిపిస్తుంది. త్రేన్సులు, ఎక్కిళ్ళు, హార్ట్ ఎటాక్ వస్తుందేమోనన్న భయం చాలా మందిలో నెలకొంటుంది…. ఆ భయం కారణంగా ఒళ్ళంతా చెమటలు పట్టటం వంటివి చోటు చేసుకుంటాయి.

గొంతు దగ్గర నుంచి పొట్టదాకా ఉండే పేగు భాగాలలోపల సున్నితమైన పల్చని పొర ఉంటుంది. దీన్ని మ్యూకస్ పొర అంటారు. పేగులోపల పెరిగిన ఈ పులుపు పదార్థాలలో ఆమ్లాలు నిండడంతో ఈ పొర భుగభగమంటుంది. లోపల ఏదో కాలుతున్నట్టు అనిపిస్తుంది. అది గుండెకు దగ్గరగా ఉండే భాగంలో జరగడం వలన గుండెల్లో మండుతున్నట్లు అనిపిస్తుంది. కడుపు ఉబ్బరం, విరేచనానికో మూత్రానికి వెళ్ళాల్సి రావటం, వాంతి అయ్యే అవకాశం ఉంటుంది.

ఇలాంటి బాధలన్నీ పేగుల్లో యాసిడ్ పెరగటం వలన ముంచుకొచ్చేవిగా భావించాలి. వీటన్నింటికీ కారణమైన పులుపు, మసాలాలు, కారాలను అపరిమితంగా తీసుకోవటం వల్ల చాలా మేర సమస్య నుండి బయటపడవచ్చు. గుండెలో మంట ఉన్నవాళ్ళు ఉదయం పూట టిఫిన్లు తినటం మానేయాలి. పెరుగన్నం తీసుకోవాలి. టిఫిన్ చేయటం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. శనగపిండి, చింతపండు, ఇతర పులుపు పదార్థాలు, నూనెలో వేసి వేయించిన వేపుళ్ళు, బాగా వేడిచేసే వస్తువులు ఎసిడిటీకి ముఖ్యకారణ భూతాలు.

బియ్యం, కంది పప్పు, పెసరపప్పు, ఉలవలు వీటిని దోరగా వేయించి వండుకోవలాలి. వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల తేలికగా అరుగుతాయి. కేరట్, ముల్లంగి, యాపిల్, కర్బూజా లేదా బొప్పాయి వంటి వాటిని సమానంగా తీసుకుని మిక్సీ పట్టి జ్యూసు చేసుకుని ఒక గ్లాసు మోతాదులో రోజు రెండు పూటలా తీసుకోవటం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది. దాహం తీర్చుకోవడానికి మజ్జిగమీద తేరుకున్న నీటినిగానీ, పల్చని మజ్జిగను గానీ తాగటం మంచిది.

బార్లీజావ, సగ్గుబియ్యం జావ, సబ్బాగింజలు నీళ్ళు లాంటివి తాగితే ఎసిడిటీ త్వరగా తగ్గుతుంది. పాలు తాగితే ఎసిడిటీ పెరుగుతుంది. పాలు, పాల పదార్థాలు అంత శ్రేయస్కరం కాదని గుర్తించాలి. బూడిదగుమ్మడి, సొర, బీర, పొట్ల వీటి గుజ్జుతో పెరుగుపచ్చడి చేసుకుని అన్నంలో తింటే ఎసిడిటీ పెరగకుండా ఉంటుంది. పులిసిన, పులవబెట్టిన పదార్థాలను పూర్తిగా మానేయండి. దానిమ్మ, ఉసిరి ఎసిడిటీని పెంచకుండా మేలుచేస్తాయి. పండిన వెలగపండు ఎసిడిటీకి మంచి ఔషధంలా పనిచేస్తుంది. అరటి,జామ, బొప్పాయి, మేలు చేస్తాయి.