Calcium : రోజుకు వయస్సుల వారిగా ఎవరికెంత కాల్షియం శరీరానికి అవసరమంటే?

కాల్సియంను శరీరం గ్రహించాలంటే మన శరీరంలో విటమిన్ డి తగినంత ఉండాలి. సప్లిమెంట్ల రూపంలో మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదం ఏర్పడుతుంది. జీర్ణక్రియ మందగించటం, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం , కోమాలోకి వెళ్లటం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాల్షియం తక్కువైతే ఆస్టియోపారాసిస్ వస్తుంది.

Calcium : రోజుకు వయస్సుల వారిగా ఎవరికెంత కాల్షియం శరీరానికి అవసరమంటే?

calcium

Calcium : ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కండరాల కదలికలకు, నాడీ వ్యవస్ధ పనులకు, రక్తపోటును సాధారణస్ధాయిలో ఉంచటానికి , రోగనిరోధక శక్తిని కాపాడటానికి శరీరానికి కాల్సియం అవసరమౌతుంది. రోజుకి ఎంత కాల్షియం తీసుకోవాలి అనేది వయస్సు, ఎదుగుదల దశను బట్టి అధారపడి ఉంటుంది.

మూడేళ్ల వయస్సు లోపు పిల్లలకు రోజుకి 700 నుండి 1000మి.గ్రా ఆహారం ద్వారా కాల్సియం అందించాలి. 18ఏళ్లలోపు వారికి 13 వందల మిల్లీగ్రాముల కాల్సియం సరిపోతుంది. 70 ఏళ్ల లోపు మహిళలకైతే 12 వందల మిల్లీ గ్రాములు, పురుషులకు 1000మిల్లీ గ్రాముల కాల్షియం సరిపోతుంది. 70 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి 1200మి.గ్రా కాల్షియం అవసరమౌతుంది. గర్భిణీలు, తల్లులైన వారికి రోజుకు 1000మి.గ్రా కాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే కాల్సియంను శరీరం గ్రహించాలంటే మన శరీరంలో విటమిన్ డి తగినంత ఉండాలి. సప్లిమెంట్ల రూపంలో మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదం ఏర్పడుతుంది. జీర్ణక్రియ మందగించటం, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం , కోమాలోకి వెళ్లటం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాల్షియం తక్కువైతే ఆస్టియోపారాసిస్ వస్తుంది. కాల్షియం శరీరానికి అందాలంటే పాల ఉత్పత్తులు, చేపలు, కూరగాయాలు, టోపూ, కాయ ధాన్యాలు ను తీసుకోవటం మంచిది.