Sesame Seeds : ఆరోగ్యానికి నువ్వులు ఎంతగా ఉపయోగపడతాయంటే?..

నువ్వులు అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు మంచి మార్గం. అంటే అధిక రక్తపోటు ఉన్నవాళ్లు వీటిని తీసుకుంటే రక్తపోటు స్థాయిలు క్రమంగా తగ్గిస్తాయివి.

Sesame Seeds : ఆరోగ్యానికి నువ్వులు ఎంతగా ఉపయోగపడతాయంటే?..

Sesame Seeds

Sesame Seeds : భారతీయులు ప్రాచీన కాలం నుండి వాడుతున్న పదార్థాల్లో నువ్వు ప్రథమ స్థానంలో ఉన్నాయి. వంటల్లో ఉపయోగించడం నుండి మనిషి చనిపోయాక పిండప్రధానాల వరకు అన్నింటిలో నువ్వులను ఉపయోగించటం సాంప్రదాయంగా వస్తుంది. నువ్వులలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్ ఎ, విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9. విటమిన్ సి, విటమిన్ ఈ. మరియు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ మొదలైన బోలెడు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని చాలా బలంగా తయారు చేస్తాయి.

నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటితో తయారుచేసిన పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం. ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా ఉపయోగిస్తారు.

నువ్వులు సాదారణంగా రెండు రకాలు. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఆయుర్వేదం శాస్త్రంలో నువ్వులకు గొప్ప స్థానం నుండి, నువ్వుల నుండి లభ్యమయ్యే నూనె ఆవకాయ పెట్టడానికి కొన్ని ప్రాంతాల్లో వంటలు చేయడానికి ఉపయోగించడం మనకు తెలిసినదే.

నువ్వులను వేయించి బెల్లం జతచేసి బాగా దంచి చలిమిడిలాగా తినవచ్చు. వయసులో వచ్చిన ఆడపిల్లలకు ఇది పెట్టడం సంప్రదాయం కూడా. దీని ఉదేశ్యం నడుము గట్టిపడుతుంది, ఐరన్ పుష్కలంగా అందడం వల్ల రక్తం భర్తీ అవుతుంది. నువ్వులు దోరగా వేయించి బెల్లం పాకంలో వేసి లడ్డులుగా చేసుకుని తినవచ్చు.

డ్రై ఫ్రూట్స్ తో కలిపి ఎనర్జీ బార్స్ గా తయారు చేసుకోవచ్చు. నువ్వుల పొడిని పులిహోరలో జోడించవచ్చు. నువ్వుల పచ్చడి, నువ్వుల పొడి జత చేసిన కూరలు తయారుచేసుకోవచ్చు.తెల్ల నువ్వుల నుండి నూనెను తీయగా మిగిలిన పిప్పిని తెలగపిండి పేరుతో అమ్ముతారు. దీంతో కూర వండుకుని తింటారు. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఈ కూర చాలా బలవర్థకమైనది.

పరకడుపున స్పూన్ నువ్వులను నోట్లో వేసుకుని మెల్లిగా నమిలి తినాలి. దీనివల్ల శరీరం మొత్తం శుద్ధి అవుతుంది. పంటి సమస్యల నుండి జీర్ణసమస్యల వరకు అన్ని తగ్గిపోతాయి. నువ్వులను గానుగ పట్టించడం లేదా మిషన్ కు వేయడం ద్వారా తయారుచేసే నువ్వుల నూనె, అన్ని నూనెలలోకెల్లా ఉత్తమమైనది. నూనెను ఉపయోగించి తయారు చేసిన ఆహారం తినడం వల్ల శరీరంలో రక్తం శుద్ది జరుగుతుంది.

రక్తం యొక్క గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో నువ్వులు ప్రయోజనకరమైన ఆహార పదార్థంగా గుర్తింపబడ్డాయి. నువ్వుల గింజలలో ఉండే ఫైబర్ మరియు ప్రోటీన్ కంటెంట్ వల్ల ఇది సాధ్యమవుతుంది,
శరీరం యొక్క ఇన్సులిన్ నిరోధకతను మరింత తగ్గిస్తుంది, తద్వారా మనం తీసుకునే ఆహార పదార్థాలలో చక్కెరలను విచ్ఛిన్నం చేస్తుంది. అయితే నువ్వులను పరిధికి మించి తీసుకుంటే చక్కర స్థాయిలు అనూహ్యంగా తగ్గి ప్రమాదాన్ని కలిగిస్తాయి..

నువ్వుల నూనెను ఒళ్ళంతా పట్టించుకుని కొద్దిసేపు ఆగిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే చర్మకాంతి మెరుగవుతుంది. చర్మసంబంధ సమస్యలు అన్ని తగ్గిపోతాయి. చర్మం నునుపు సంతరించుకుని ముడుతలను మాయం చేస్తుంది. పక్షవాతం వచ్చిన రోగులకు బాగా ఉపయోగిస్తారు. ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల పక్షావాతానికి గురయ్యి బిగుసుకుపోయిన నరాలు క్రమంగా వదులుగా మారతాయి.

నువ్వులు అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు మంచి మార్గం. అంటే అధిక రక్తపోటు ఉన్నవాళ్లు వీటిని తీసుకుంటే రక్తపోటు స్థాయిలు క్రమంగా తగ్గిస్తాయి. నువ్వుల గింజలలో ఉండే ఖనిజాలు రక్తప్రవాహంలో చేరే అధిక ఉప్పు వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. నెలసరి సమస్యలతో బాధపడేవారు నువ్వులకు దూరంగా ఉండాలి. ఇవి వేడి కలిగిస్తాయి. ఫలితంగా అధిక ఋతుస్రావం జరగడానికి కారణం అవుతాయి.

నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది. నువ్వులలో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నువ్వులు ఒమేగా -3, ఒమేగా -6, ఒమేగా -9 ఆమ్లాలని కలిగి ఉండి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

రక్తహీనత తగ్గేందుకు… 100 గ్రాముల నల్ల నువ్వులలో, 100 గ్రాముల బెల్లం కలిపి దంచి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు ఉసిరికాయంత తిని, ఆ తర్వాత 100 మిల్లీ లీటర్ల పాలు లేదా, గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. చక్కెర వ్యాధిగ్రస్తులు బెల్లం లేకుండా కేవలం 5 గ్రాముల నల్లనువ్వుల పొడిని 100 మిల్లీ లీటర్ల వేడి పాలలో కలిపి రాత్రిపూట సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.

నువ్వుల నూనెలో భాస్వరం ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నువ్వుల నూనెను చెక్కతో చేసిన గానుగ నుండి తీసినది మాత్రమే వాడాలి. 100 గ్రాముల తెల్ల నువ్వులలో 1000 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. నువ్వులు, బాదం కన్నా 6 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి. నలుపు మరియు ఎరుపు నువ్వులు ఇనుముతో సమృద్ధిగా ఉంటాయి. ఇది రక్త లోపానికి చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది.

నువ్వుల నూనెలో మోనో- అసంతృప్త కొవ్వు ఆమ్లం ఉంటుంది, ఇది మంచి కొలెస్ట్రాల్‌ను అందించటం ద్వారా శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బులు, గుండెపోటు మరియు అథెరోస్క్లెరోసిస్ అవకాశాలను తగ్గిస్తుంది. క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది.