Cholesterol : కొలెస్ట్రాల్ తగ్గాలంటే తినే తిండి విషయంలో!

నూనెలో బాగా వేయించిన వంటకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటికి బదులు ఉడికించినవి, తక్కువ నూనెతో లేదా అసలు నూనె లేకుండా కాల్చిన రొట్టెల వంటివి తీసుకోవటం మేలు. కొవ్వు ఎక్కువగా ఉండే గొర్రె మాంసం వంటివి తింటే కొలెస్ట్రాల్‌ మోతాదు మరింత పెరిగే ప్రమాదముంది.

Cholesterol : కొలెస్ట్రాల్ తగ్గాలంటే తినే తిండి విషయంలో!

Cholesterol

Cholesterol : ఒంట్లో కొలెస్ట్రాల్‌ మోతాను తగ్గించుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వాస్తవానికి మనము తీసుకునే కొన్ని ఆహారపదార్ధాలు కొలెస్ట్రాల్ ఉత్ప త్తిని పెంచుతాయి. పాలు , నెయ్యి, వెన్న , కేక్ లు ,పేస్టులు , జంతు మాంసం ఉత్పత్తులు వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తినే తిండి విషయంలోనూ అదుపు పాటించటంతోపాటుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలంటే కొవ్వు తక్కువ మోతాదులో ఉండే పదార్థాలను తీసుకోవాలి. వేపుళ్లకు బదులు ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు తీసుకోవచ్చు. బటర్‌, క్రీమ్‌తో అలంకరించిన తినుబండారాలకూ దూరంగా ఉండాలి. కూరల్లో అదనంగా ఉప్పు వేసుకోవటం మంచిదికాదని గుర్తించుకోవాలి. ఆహారాన్ని బాగా నములుతూ నెమ్మదిగా తినాలి. దీంతో అధికమోతాదులో తినకుండా చూసుకోవచ్చు. భోజనం ముగిశాక ఐస్‌క్రీం వంటివి తినకూడదు. వాటికి బదులుగా తాజా పళ్ల ముక్కలను తినే అలవాటు చేసుకోవాలి.

నూనెలో బాగా వేయించిన వంటకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటికి బదులు ఉడికించినవి, తక్కువ నూనెతో లేదా అసలు నూనె లేకుండా కాల్చిన రొట్టెల వంటివి తీసుకోవటం మేలు. కొవ్వు ఎక్కువగా ఉండే గొర్రె మాంసం వంటివి తింటే కొలెస్ట్రాల్‌ మోతాదు మరింత పెరిగే ప్రమాదముంది. కాబట్టి వాటికి బదులు చేపలు, చికెన్‌ వంటివి తీసుకుంటే మంచిది. నట్స్ ఆవకాడో, సీడ్స్ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నట్టు తెలిస్తే వెంటనే మీ యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. లేదంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. హార్ట్ ఎటాక్, డయాబెటిస్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.