Corona Effects: తల్లిదండ్రులూ జాగ్రత్త.. ప్రమాదంలో పిల్లలు.. ఐదు చిట్కాలు ఇవే!

Corona Effects: తల్లిదండ్రులూ జాగ్రత్త.. ప్రమాదంలో పిల్లలు.. ఐదు చిట్కాలు ఇవే!

Children Lockdown

రెండేళ్ల నుంచి కరోనా కారణంగా పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లు లేవు.. ఆటల్లేవు.. ఇంట్లోనే.. నాలుగు గోడల మధ్య ఎక్కువగా ఫోనుల్లో.. టీవీలు అంటూ గడిపేస్తున్నారు. మహమ్మారి బాధ పోయిందని బయటకు వచ్చేలోపు సెకండ్ వేవ్ వచ్చేసింది. ఈ క్రమంలో పిల్లలను ఇళ్లలో ఖైదు చేయవలసిన పరిస్థితి వచ్చింది.

సెకండ్ వేవ్ వచ్చాక లాక్‌డౌన్ ఇప్పుడు దాదాపుగా ప్రతిరాష్ట్రంలోనూ ఉండడంతో.. పిల్లలను ఇంట్లోనే ఉంచడం చాలా కష్టమవుతోంది. పాఠశాలలు, కళాశాలలు మూసుకోగా.. కరోనా కారణంగా, స్నేహితులను కలవలేకపోతున్నారు పిల్లలు. ఫిజికల్‌గా ఆడే పరిస్థితి లేదు. పార్కులు, మాల్స్, ఈత కొలనులు, జిమ్‌లు పర్యాటక ప్రదేశాలు అన్నీ మూసివేయబడ్డాయి. వేసవి ఎంజాయ్‌మెంట్ అనే మాటను మర్చిపోతున్నారు.

పిల్లలు ఇంట్లో ఎక్కువసేపు ఉండడం వారి స్వభావంలో చాలా మార్పులు వస్తున్నట్లుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాల్యం అంటే నడవడం, ఆనందించడం, ప్రశాంతంగా ఉండటం.. ఆందోళన చెందకపోవడం. కానీ ఇప్పుడు పిల్లలు ఆందోళన ఎక్కువగా చిరాకు పెరిగిపోతుంంది. ఇంట్లో దీర్ఘకాలం ఉండడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల్లో కూడా సమస్య పెరుగుతోంది.

అయితే కొన్ని చిట్కాలను ఉపయోగించి పిల్లలను సంతోషంగా ఉంచాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

1- తల్లిదండ్రలు పిల్లలతో ఆడుకోవాలి..
మనమందరం మన బాల్యంలో క్యారమ్, లూడో వంటి ఇండోర్ గేమ్స్ ఆడే ఉంటాము. ఇప్పుడు పిల్లలు మాత్రం ఎక్కువగా మొబైల్ ఫోన్‌లలో తలకాయ పెట్టేస్తున్నారు. ఈ సమయం పిల్లలకు కొంత సమయం కేటాయించి వారితో ఆడుకోవాలి.. ఆటలతో పిల్లలతో గడపాలి. ఇది పిల్లలను సంతోషంగా ఉంచుతుంది. దీనివల్ల కాసేపైనా టీవీ మరియు ఫోన్‌కు దూరంగా ఉంటారు పిల్లలు.

2- పిల్లలకు ఇష్టమైన ఆహారాన్ని తయారు చేయండి.. చేయించండి-
పిల్లలు తినడానికి మరియు త్రాగడానికి చాలా ఇష్టపడతారు. బయట ఫుడ్ తినడానికి స్నాక్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి.. మీరు వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇంట్లో తయారు చేయండి.. వీలైతే వారికి నేర్పిస్తూ చేయండి.. కొత్తరకం వంటకాలు యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో దొరుకుతున్నాయి కాబట్టి వాటిని వండే ప్రయత్నం చేయండి. ఇది పిల్లలకు సంతోషాన్నిస్తుంది.

3- ప్రతిరోజూ ఒక లక్ష్యం-
పిల్లల విసుగును అధిగమించడానికి ఏదో ఒక మార్గం వారికి ఇవ్వండి.. టార్గెట్ ఇవ్వడం ద్వారా వారు కష్టపడుతారు. వారికి చిన్న పనులు ఇవ్వండి. అవి పూర్తయినప్పుడు, వారు ఇష్టపడేదాన్ని గిఫ్ట్‌గా ఇస్తామని చెప్పండి.. ఇవ్వండి.. ఈ విధంగా పిల్లవాడు బిజీగా ఉంటాడు. ఒంటరితనం మర్చిపోతాడు.

4- కథలు చెప్పండి-
పిల్లలు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. మొబైల్ మరియు టీవీ ప్రపంచంతో చాలా సార్లు వారు విసుగు చెందుతారు. వారు తమ పుస్తకాలు చదివిన తరువాత కూడా విసుగు చెందుతారు. అటువంటి పరిస్థితిలో, కొత్త కథలను చెప్పాలి. ఇంతకు ముందు తాతలు చెప్పే కథలను పిల్లలు చాలా జాగ్రత్తగా వినేవారు. ఇది పిల్లల శారీరక మరియు మానసిక అభివృద్ధికి సహకరిస్తుంది.

5- ఇంట్లో తిట్టుకోవద్దు –
కరోనా సమయంలో పిల్లల ముందు నెగెటివ్ మాటలు మాట్లాడుకోవద్దు.. అటువంటి వార్తలను కూడా చూపించవద్దు, ఇది పిల్లల మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల ముందు తిట్టుకోవద్దు. ఇంట్లో ప్రేమ, ఆనందంతో కూడిన వాతావరణాన్ని ఉంచండి.