Hemoglobin : రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిందా?

బీట్ రూట్, టమోటాలు, పాలకూర, గ్రీన్ పీస్, రాజ్మా, క్యాబేజీ, టర్నిప్, చిలకడదుంప, క్యాప్సికం, మిరియాలు, గుమ్మడికాయ మరియు కాలీఫ్లవర్ వంటి కూరగాయలలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

Hemoglobin : రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిందా?

Hemoglobin

Hemoglobin : చాలా మందిలో రక్తహీనతా, హిమోగ్లోబిన్ లోపం వంటి సమస్యలతో సతమతమౌతుంటారు. రక్తంలో హిమోగ్లోబిన్ లోపిస్తే అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రక్తహీనత, హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్న వారు ఐరన్ అధికంగా లభించే ఆహారాలను తీసుకోవాలి. మాంసం, పాలకూర, నట్స్ వంటి వాటిని ఎంత ఎక్కువ మోతాదులో తీసుకుంటే అంత మంచిది. వీటిని తీసుకోవటం మల్ల హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవచ్చు. ఫోలిక్ యాసిడ్ అందే ఆహారాన్ని తీసుకోవటం వల్ల విటమిన్ బి సమృద్ధిగా శరీరానికి అందుతుంది. ఎర్రరక్తకణాల వృద్ధికి ఇది దోహదం చేస్తుంది.

తృణధాన్యాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని హిమోగ్లోబిన్ శాతం తగ్గకుండా చూస్తుంది. వారంలో నాలుగైదు రోజులు తృణధాన్యాలతో చేసే ఆహారాలను తీసుకోవటం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న చిన్నారులకు రోజుకు ఒక గుడ్డును తినిపించటం మంచిది. అలాగే పాలూ, మజ్జిగ, పెరుగూ, పనీర్, చీజ్, వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. పుచ్చకాయ, యాపిల్, అరటిపండ్లు, నారింజ పండ్లలో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. రక్త కణాల సంఖ్యను పెంచటంలో కీలక పాత్ర వహిస్తాయి.

బీట్ రూట్, టమోటాలు, పాలకూర, గ్రీన్ పీస్, రాజ్మా, క్యాబేజీ, టర్నిప్, చిలకడదుంప, క్యాప్సికం, మిరియాలు, గుమ్మడికాయ మరియు కాలీఫ్లవర్ వంటి కూరగాయలలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. సాధారణంగా శరీరంలో హీమోగ్లోబిన్ ఎంత ఉండాలన్న విషయాన్ని పరిశీలిస్తే మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 సంవత్సరంలోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణీ స్త్రీలలో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు, 6 నుండి 12 సం.ల లోపు పిల్లలలో్ 12 గ్రాములు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హీమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తక్కువగా ఉంటే రక్త హీనత సమస్య ఉన్నట్లు అర్ధం చేసుకోవాలి.