Kidney : కీడ్నీలో రాళ్ల సమస్య ఉంటే ఈ ఆహారాలు తినకపోవటమే బెటర్

కిడ్నీ స్టోన్ రోగులు నాన్ వెజ్‌ ఆహారాలు తినకూడదు. నాన్-వెజ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ మూత్రపిండాల పై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.

Kidney : కీడ్నీలో రాళ్ల సమస్య ఉంటే ఈ ఆహారాలు తినకపోవటమే బెటర్

Kidney Stones

Kidney : శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాల్లో మూత్ర పిండాలు ఒకటి. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు కీలకం. వీటి పనితీరులో మార్పు వస్తే సమస్యలు తలెత్తుతాయి. ఎంతో సున్నితంగా ఉండే కిడ్నీలను కాపాడు కోవాలంటే నీళ్లు బాగా తాగాలి. నీరు తక్కువగా తాగేవారి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కిడ్నీల్లో రాళ్ల తో బాధపడుతున్నారు.

లవణాలు, యూరిక్ ఆమ్లాలు, కాల్షియం, ఖనిజాలు కలయికతో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. ఈసమస్య ఉన్నవారికి పొత్తికడుపులో నిరంతరం నొప్పి వస్తుంది, అకస్మాత్తుగా భరించలేని నొప్పి, మూత్ర విసర్జన చేసేటప్పుడు కొద్దిగా నొప్పి, తరచుగా మూత్ర విసర్జన, వికారం,బలహీనత, మైకం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీలో రాళ్లు అనేది సర్వ సాధారణ సమస్య అయినప్పటికీ దీనిని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు చెడిపోతాయి.

కిడ్నీలో రాళ్లు ఉన్న వారు కొన్ని కొన్ని ఆహారాలను తీసుకోకపోవటం ఉత్తమం. కిడ్నీలో రాళ్లు ఉన్న వారు మాత్రం టీ తాగరాదని నిపుణులు చెబుతున్నారు. టీ తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ మరింత పెద్దవిగా మారి తీవ్రమైన ఇబ్బందిపడాల్సి వస్తుంది. బచ్చలి కూర తినటం వల్ల కిడ్నీలో రాళ్లు మరింత ఎక్కువ అవుతాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఆహారంలో ఉప్పును తగ్గించాలి. జంక్ ఫుడ్ తినడం మానుకోవటం మంచిది. పొటాటో చిప్స్, ప్యాకేజ్ సాస్, కెచప్, వేరు శెనగలు, చట్నీలు, సాల్ట్ నట్స్, చీజ్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

కిడ్నీ స్టోన్ రోగులు నాన్ వెజ్‌ ఆహారాలు తినకూడదు. నాన్-వెజ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ మూత్రపిండాల పై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు చాక్లెట్లు తినకూడదు. చాక్లెట్‌లో ఆక్సలేట్ ఉంటుంది దీనివల్ల కిడ్నీ స్టోన్స్ పెరుగుతాయి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను మితంగా తీసుకోవాలి. విటమిన్ సి లో ఉండే ఆక్సలేట్ కాల్షియంను నిల్వలను పెంచుతుంది. ప్యాక్ చేసిన ఆహారం, నిల్వ పచ్చళ్లు, టమాటాలు, కూల్ డ్రింక్స్‌, సోడాలు, బీట్‌రూట్‌, కందగడ్డ, జంక్ ఫుడ్‌, పొటాటో చిప్స్, ప్యాకేజ్ సాస్, కెచప్, వేరు శెనగలు, చట్నీలు, సాల్ట్ నట్స్, చీజ్ వంటి వాటిని తినటం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి.