Millets : చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే మిల్లెట్స్!

మిల్లెట్లలోని నియాసిన్ లేదా విటమిన్ B3 కంటెంట్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, గుండె జబ్బులకు ప్రమాద కారకాలైన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిలను తగ్గించడంలో తోడ్పడతాయి.

Millets : చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే మిల్లెట్స్!

MILLETS

Millets : జొన్నలు, సజ్జలు, రాగులు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, అవిసెలు వీటినే తృణ ధాన్యాలు అంటారు. పూర్వం వీటిని ఆహారంగా ఎక్కవగా వినియోగించేవారు. ప్రస్తుతం ఆహారంగా తీసుకుంటున్న వ‌రి, గోధుమ‌ల‌ను పొట్టు తీసి తీసుకుంటారు. వాటిల్లో పీచు ప‌దార్థం దాదాపుగా ఉండదు. అయితే సిరిధాన్యాల్లో లోపలి పొర‌ల్లో ఫైబర్ ఉంటుంది. మిల్లెట్స్ లో ఫైబర్ పరిమాణం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి వేయదు. బరువు తగ్గేందుకు ఉపకరిస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.

తృణధాన్యాలను కాయధాన్యాలతో కలిపి తీసుకుంటే బియ్యం పప్పు లాగా మాంసకృత్తులను అధిక మొత్తంలో శరీరానికి అందిస్తాయి. మిల్లెట్లలోని నియాసిన్ లేదా విటమిన్ B3 కంటెంట్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, గుండె జబ్బులకు ప్రమాద కారకాలైన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిలను తగ్గించడంలో తోడ్పడతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

బియ్యం, రోటీలలో కేలరీలు ఉంటాయి. మిల్లెట్లలో ఉండే గ్లూటెన్ అలెర్జీ సమస్యలను తగ్గిస్తుంది. అధిక ప్రోటీన్లు, విటమిన్ ఏ, సీ, విటమిన్ బీ కాంప్లెక్స్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ లు అధికంగా ఉంటాయి. తృణధాన్యాలలో ఉండే క్రొవ్వుశాతం ప్రతి వందగ్రాములకు 2-5 గ్రాములుగా ఉంటుంది. తృణ ధాన్యాలలో వుండే పోషక విలువలు మన శారీరక ధృడత్వానికి ఎంతో ఉపకరిస్తాయి. తృణ ధాన్యాలు ఆహారంగా తీసుకోవడం వలన నరాలు బలహీనత, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.