NeoCoV Alert : ప్రపంచాన్ని కలవరపెట్టే ఈ కొత్త NeoCoV వైరస్‌పై ఆందోళనే వద్దు.. ఎందుకంటే? ఈ ఒరిజినల్ స్టడీ చదవాల్సిందే..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం సృష్టిస్తోంది. కరోనా ఇంకా తగ్గనేలేదు.. ఇప్పుడు మరో కొత్త NeoCoV వైరస్ పుట్టుకొచ్చిందని అంటున్నారు. ఇది ప్రాణాంతకమా? సైంటిస్టులు ఏమంటున్నారంటే..?

NeoCoV Alert : ప్రపంచాన్ని కలవరపెట్టే ఈ కొత్త NeoCoV వైరస్‌పై ఆందోళనే వద్దు.. ఎందుకంటే? ఈ ఒరిజినల్ స్టడీ చదవాల్సిందే..!

Neocov Alert Why We Do Not

NeoCoV Alert :  ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం సృష్టిస్తోంది. కరోనా వ్యాప్తి ఇంకా తగ్గనేలేదు.. రోజురోజుకీ ఎన్నో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. సైంటిస్టులకు కూడా అంతుచిక్కని వైరస్లు, వేరియంట్లు విజృంభిస్తున్నాయి. కరోనా నుంచి ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ వేరియంట్లు చాలవనట్టు మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని బెంబేలిత్తిస్తోంది. ఆ వైరస్ ఇప్పుడు వచ్చిన వేరియంట్ల కంటే అత్యంత ప్రమాదకరమని, అదిగానీ, మనుషుల్లో సంక్రమిస్తే.. అధిక మరణాల రేటు ఉంటుందని అంటున్నారు.

దక్షిణాఫ్రికాలో ‘నియో కోవ్‌’ (NeoCoV) కొత్త రకం వైరస్‌ గా చెబుతున్నారు. ఈ వైరస్ సోకితే ముగ్గురిలో ఒకరికి మరణముప్పు తప్పదని వుహాన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఈ NeoCov వైరస్‌ దక్షిణాఫ్రికాలోని ప్రాంతంలో గబ్బిలాల్లో ఉందని గుర్తించారు. ఇదో రకమైన కరోనా వైరస్ అంటున్నారు శాస్త్రవేత్తలు. చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపిన అనంతరం ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతానికి ఈ NeoCov వైరస్.. జంతువుల నుంచి జంతువులకు మాత్రమే సోకుతోంది. మనుషుల్లో ఇప్పటివరకూ వ్యాపించలేదు.. భవిష్యత్తులో ఈ వైరస్ రూపాంతరం చెంది మనుషుల్లోనూ సంక్రమించే ముప్పు లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ అనేక రూపాల్లో రూపాంతరం చెందుతూ వస్తోంది. ఆల్ఫా నుంచి డెల్టా నుంచి ఒమిక్రాన్ వరకు కోవిడ్-19 ఎన్నో రూపాల్లో మానవ జీవితాల్లోకి ప్రవేశించింది. 2019 ఏడాది చివరలో చైనాలో మొదటగా ఈ కొత్త కరోనావైరస్ ఉద్భవించింది. ప్రారంభంలోనే ఈ కరోనాకు అధికారికంగా SARS-CoV-2 అని పేరు పెట్టారు. అప్పటినుంచి Covid-19 రెండు ఏళ్లుగా ప్రపంచాన్ని శాసిస్తోంది.

ప్రపంచ జనాభాను ముప్పు తిప్పలు పెడుతోంది. అప్పటినుంచి ప్రపంచమంతా కరోనా భయంతోనే జీవిస్తోంది. ఇంకా ఎన్నాళ్లు ఈ కరోనా కోరల్లో మానవ జీవనం కొనసాగించాలో తెలియక బిక్కుబిక్కుమని జీవిస్తున్న పరిస్థితి.. కరోనా మొదటి వేవ్, రెండో వేవ్.. ఇప్పుడు మూడో వేవ్.. ఇలా ఎన్నో కరోనా వేవ్ లు వస్తాయో.. ఇంకా ఎన్నో మరణాలకు దారితీస్తాయోనన్న ఆందోళనే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకిత్తిస్తోంది. ఈ క్రమంలో మరో కరోనావైరస్ ‘NeoCoV’ పుట్టుకొచ్చిందనే వార్త.. మానవ జీవితాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

ఇంతకీ NeoCoV వైరస్ అంత ప్రాణాంతకమా? సైంటిస్టులు ఏమంటున్నారు? ఇతర కరోనా వేరియంట్లకు దీనికి మధ్య ఏమైనా తేడా ఉందా? మనుషుల్లో సోకే ముప్పు పొంచి ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ ఒరిజినల్ స్టడీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గూగుల్లో NeoCoV పదం ట్రెండింగ్.. సెర్చింగ్ ఇండియాలోనే..
అసలు ఈ NeoCoV వైరస్ అంటే ఏంటి? అని ఇప్పటికే గూగుల్‌లో తెగ సెర్చ్ చేసేస్తున్నారట.. గూగుల్ ప్రకారం.. శుక్రవారం (జనవరి 28) చివరి నాటికి, ‘NeoCoV’ భారత్‌లో 5 లక్షల కంటే ఎక్కువగా సెర్చ్ చేశారట.. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో మూడవ వేవ్ నుంచి ఎలా బయటపడాలా అనుకుంటున్న తరుణంలో ఈ కొత్త వైరస్ పేరు వినే సరికి మరింత ఆందోళన కలిగిస్తోంది. సైంటిస్టులు చెబుతున్నమాట.. నిజానికి ఈ NeoCoV వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.

ఎందుకంటే.. బ్యాట్‌ (గబ్బిలాలు)లోనే కోవిడ్-19కి కారణమయ్యే కరోనావైరస్ ఉంటుంది. అయితే ఈ వైరస్ కరోనా వైరస్ బ్యాట్ లో గుర్తించినప్పటికీ.. ఆ కోవకు చెందినది కాదని అంటున్నారు. NeoCoV వైరస్ గురించి చైనీస్ శాస్త్రవేత్తల బృందం విడుదల చేసిన అధ్యయనంపై ఇంకా సమీక్ష జరగలేదంటున్నారు. ముందుగానే లేనిపోని భయాందోళనలకు గురికావొద్దని ఇతర సైంటిస్టులు సూచిస్తున్నారు. అసలు ఈ అధ్యయనం ఎలా జరిగింది? NeoCoV వైరస్ విషయంలో ఇప్పుడే ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదో సైంటిస్టులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

NEOCOV వైరస్ అంటే ఏంటి? :
NeoCoV అనేది MERS -CoV వైరస్ ఇదో రకం వేరియంట్‌.. ప్రస్తుత వాడుకలోని కరోనా వైరస్ వేరియంట్లకు దీన్ని ఒక పదంగా చెబుతున్నారంతే.. ఇది.. MERS-CoV అనే పెద్ద కరోనావైరస్ కుటుంబానికి చెందినది.. మనుషులకు సోకే కరోనావైరస్లలో ఏడింటిలో ఇదొకటిగా చెప్పవచ్చు. MERS-CoV అనేది.. 2010లలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణ కొరియాలో పెద్ద ఎత్తున వ్యాప్తి చెందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. MERS-CoV సంక్రమించిన బాధితుల్లో సుమారు 35శాతం మంది మాత్రమే మరణించారు. NeoCoV అనేది ఒక నిర్దిష్ట కరోనావైరస్ వేరియంట్‌గా చెప్పవచ్చు.

NEOCOV వైరస్ కొత్తదా? ఇప్పుడే కనుగొన్నారంటే? :
వాస్తవానికి.. NeoCoV అనే పదం దీనిది కాదు.. ఈ పదాన్ని పలకడం కూడా కష్టంగా ఉంటుంది. అసలు ఇది కొత్త కరోనావైరస్ కాదని కొత్త మ్యుటేషన్ అసలే కాదని నిపుణులు కూడా చెబుతున్నారు.. కరోనా వేరియంట్ కూడా కాదని నిపుణులు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. NeoCoV ట్విట్టర్‌లో కూడా తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఎక్కడా కూడా ఇదో కరోనావైరస్ కొత్త రూపంగా ప్రకటించలేదు.

NEOCOV రీసెర్చ్ ఏం చెబుతుందంటే?
1. NeoCoV అనేది MERS-CoV వైరస్ కుటుంబంలో ఒకటిగా చెబుతున్నారు. అలాగే గబ్బిలాలలోనూ ఈ వైరస్ ఉంటుంది.
2. NeoCoV కొన్ని రకాల బ్యాట్ ACE2 (జీవశాస్త్రంలో గ్రాహకాలుగా పిలిచే ఒక రకమైన కణాలు)ను ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు..
3. T510F మ్యుటేషన్ చెందిన తర్వాత NeoCoV మానవ ACE2 కణాలకు సోకేందుకు ప్రేరేపిస్తుంది.

NEOCOV విషయంలో ఎందుకు ఆందోళన వద్దంటే? :
సైంటిస్టుల పరిశోధనా ప్రకారం పరిశీలిస్తే.. ఇప్పటివరకు గబ్బిలాలలో మాత్రమే కనుగొన్న NeoCoV వైరస్.. ఒక నిర్దిష్ట రకమైన మ్యుటేషన్‌కు గురైనప్పుడు మాత్రమే మానవులకు సోకే అవకాశం ఉంది. అది కూడా ఒక ఊహాజనితమనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రస్తుత అధ్యయనాలేమి ఇంకా పూర్తిస్థాయిలో సమీక్షించనవే ఉన్నాయి. జంతువుల్లోనే ఈ వైరస్ వ్యాపిస్తోంది తప్పా.. ఇంకా మనుషుల్లోకి సంక్రమించలేదు..

మనిషిలోని ACE2 అనేది.. NeoCoV వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా నియంత్రిస్తుంది. రిసెప్టర్-బైండింగ్ మోటిఫ్ (RBM)పై T510F మ్యుటేషన్ తర్వాత మాత్రమే NeoCoV మానవ ACE2 కణాలను సోకేందుకు అనుమతినిస్తుంది. ఆ పరిస్థితి ఉండకపోవచ్చునని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. సో… NeoCoV వైరస్ విషయంలో ఎవరూ అనవసర ఆందోళనచెందాల్సిన పనిలేదని సైంటిస్టులు గట్టిగా చెబుతున్నమాట..

Read Also : Today Gold Prices : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గుతున్న బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?