Organic Soaps : చర్మ సౌందర్యానికి ఆర్గానిక్ సోప్స్

అందం కోసం అనవసరంగా రసాయనాలు కలిసిన వివిధ సబ్బులను వాడటం వల్ల చర్మానికి హానికలుగుతుంది. సబ్బు వినియోగం కారణంగా చర్మం మీద ఉండే సహజ సిద్దమైన నూనెలు తొలగిపోయి, నిర్జీవాన్ని సంతరించుకుంటుంది.

Organic Soaps : చర్మ సౌందర్యానికి ఆర్గానిక్ సోప్స్

Soap

Organic Soaps : చర్మ సౌందర్యానికి ఇటీవలికాలంలో మార్కెట్లోకి రకరకాల సబ్బులు వచ్చేశాయి. చర్మం మృదువుగా రావడానికి ఒక సబ్బు, మంచి కలర్ రావటానికి మరొక సబ్బు, పిల్లలకి ఒక సబ్బు పెద్దలకి మరో సబ్బు ఇలా రకరకాల సబ్బులు మార్కెట్లో ఉన్నాయి. మరో వైపు ఆర్గానిక్ సబ్బులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి వల్ల చర్మ సౌందర్యం సంగతేమో కాని చర్మానికి హానికలగటం ఖాయంగా కనిపిస్తుంది. ఆసక్తికరమైన ప్రకటనలు, వాటిపై ఉండే చిత్రాలకు ఆకర్షితులై చాలా మంది సాదరణ సబ్బులను వాడేందుకు ఇష్టం చూపిస్తుంటారు.

దీనికి కారణం లేకపోలేదు. మంచి సువాసనలు వెదజల్లుతూ ఎక్కువ నురుగును ఇవ్వటమనే చెప్పాలి. అంతా బాగనే ఉన్నా సాధారణ సబ్బులలో రసాయనాలు ఎక్కువగా వినియోగిస్తారు. సబ్బులలో అత్యంత హానికరం అయిన సోడియం లారిల్ సల్ఫేట్ అనే రసాయనాన్ని ఉంటుంది. దీనితో పాటుగా కాస్టిక్ సోడా, కృత్రిమ సువాసనలు, కృత్రిమ సంరక్షణకారులను మొదలైన ఇతర రసాయనాలను కూడా ఉంటుంది. ఇవి చర్మానికి నష్టం కలిగించవచ్చు. ఆ రసాయనాలు చర్మ రంద్రాల్లోకి నేరుగా వెళ్లి చర్మానికి హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. అయితే చాలా మందికి ఈ విషయం తెలియక సాధారణ సబ్బులను వినియోగిస్తుంటారు.

అందం కోసం అనవసరంగా రసాయనాలు కలిసిన వివిధ సబ్బులను వాడటం వల్ల చర్మానికి హానికలుగుతుంది. సబ్బు వినియోగం కారణంగా చర్మం మీద ఉండే సహజ సిద్దమైన నూనెలు తొలగిపోయి, నిర్జీవాన్ని సంతరించుకుంటుంది. సబ్బులో ఉండే కాస్టిక్ యాసిడ్ చర్మంపై ఉత్పత్తి అయ్యే సహజ నూనెలను అడ్డుకుంటుంది. దీనివల్ల చర్మం మందంగా,పొడిబారినట్లు కనపడుతుంది.

ఆర్గానిక్ సబ్బులు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సాధారణ సబ్బులకు బదులు ఆర్గానిక్ సబ్బులను వాడుకోవటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనాలను వాడరు. సహజ సిద్ధంగా లభించే ఆకులు, మొక్కలు, పండ్లు వంటి వాటిని వినియోగించి సబ్బులను తయారు చేస్తారు. కాకపోతే వీటిలో నురగ తక్కువగా వస్తుంది. అయితే వీటిని వినియోగించటం అన్నది చర్మానికి ఎంతో మేలు కలిగిస్తుందని చెప్పవచ్చు. చర్మ సౌందర్యానికి దీర్ఘకాలం రక్షణ లభించాలంటే ఆర్గానిక్ సబ్బులను వినియోగించటం బెటర్.