Peppermint Oil : చలికాలంలో చర్మాన్ని తాజాగా ఉంచే పెప్పర్ మింట్ ఆయిల్!

వివిధ రూపాల్లో దీనిని ఉపయోగించవచ్చు. అనేక చర్మ సంబంధిత సమస్యలకు దీని ద్వారా పరిష్కారం పొందచ్చు. సౌందర్య ప్రయోజనాలను పెప్పర్ మెంట్ ఆయిల్ కలిగి ఉంది.

Peppermint Oil : చలికాలంలో చర్మాన్ని తాజాగా ఉంచే పెప్పర్ మింట్ ఆయిల్!

Fresh peppermint twig and oil on wooden background

Peppermint Oil : సౌందర్య సంరక్షణ కోసం పెప్పర్‌మింట్‌ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. మొటిమలు, చర్మం నిర్జీవంగా మారడం వంటి తరచుగా ఎదుర్కొనే సమస్యలనుండి బయటపడేందుకు ఇది తోడ్పడుతుంది. వివిధ రూపాల్లో దీనిని ఉపయోగించవచ్చు. అనేక చర్మ సంబంధిత సమస్యలకు దీని ద్వారా పరిష్కారం పొందచ్చు. సౌందర్య ప్రయోజనాలను పెప్పర్ మెంట్ ఆయిల్ కలిగి ఉంది. ఈ క్రమంలో సౌందర్య సంరక్షణ కోసం పెప్పర్‌మింట్‌ నూనెను ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

పెప్పర్ మింట్ ఆయిల్ ను ఉపయోగించే విధానం ;

1. కీరాదోసతో పెప్పర్ మెంట్ ఆయిల్ ; రెండు స్పూన్ల తరిగిన కీరాదోస, 5 మి.లీ. పెప్పర్‌మెంట్‌ ఆయిల్‌ తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. దీనిలో రెండు స్పూన్ల గ్రీన్‌ క్లే ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకొని 15 నిమిషాల సమయం ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మం తాజాగా తయారవుతుంది. ఇది చర్మంలోని తైల గ్రంథులు అధిక నూనెలు విడుదల చేయకుండా నిరోధిస్తుంది. దీని వల్ల ముఖం జిడ్డుగా మారటం, మొటిమలు రావటం వంటివి తగ్గుతాయి. చలికాలంలో ముఖ సౌందర్యానికి మంచి ప్రయోజనకరంగా పనిచేస్తుంది.

2. ఆలివ్‌ నూనెతో కలిపి ; గిన్నెలో మూడు టేబుల్‌స్పూన్ల ఉప్పు, రెండు చెంచాల ఆలివ్‌ నూనె, నాలుగు చుక్కల పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ చుట్టూ మృదువుగా, గుండ్రంగా రుద్దు కోవాలి. అనంతరం శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం స్క్రబ్‌లా పనిచేసి చర్మంపై చేరిన మురికి, మృత కణాలను తొలగిస్తుంది. ఫలితంగా చర్మం అందంగా, ప్రకాశవంతంగా మారుతుంది.

3. పెప్పర్ మెంట్ ఆయిల్ పంచదారతో; గిన్నెలో రెండు కప్పుల పంచదార, పావుకప్పు బాదం నూనె, టీ స్పూన్‌ పెప్పర్‌మింట్‌ నూనె వేసి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో భద్రపరచుకొని నెల రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. రోజూ స్నానం చేయడానికి ముందు ఈ మిశ్రమంతో శరీరాన్ని మర్దన చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చర్మం కోల్పోయిన తేమను తిరిగి పొందడంతో పాటు చర్మం మృదువుగా, కోమలంగా మారుతుంది.

4. పెప్పర్ మెంట్ ఆయిల్ జొజోబా ఆయిల్, విటమిన్ ఇ తో ; విటమిన్‌ ఇ, జొజోబా ఆయిల్‌ను సమపాళ్లలో తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. దీనికి కొన్ని చుక్కల పెప్పర్‌మింట్‌ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు నేరుగా మొటిమలపై రాయడం ద్వారా మొటిమల సమస్యను తొలగించుకోవచ్చు.