Radish : మూత్రపిండాలు, లివర్ ఆరోగ్యానికి ముల్లంగి

ముల్లంగి ఆకులు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముల్లంగి ఆకుల్లో ఉండే డైటరీ కంటెంట్ డైటేరియన్ అలసటను నివారిస్తుంది.

Radish : మూత్రపిండాలు, లివర్ ఆరోగ్యానికి ముల్లంగి

Radish Leaves

Radish : ముల్లంగి పేరు వింటేనే చాలా మంది అయిష్టంగా ఉంటారు. వాస్తవానికి ముల్లంగిలో ఉన్న ఔషదగుణాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు ఇష్టంగా తినేందుకు మొగ్గుచూపుతారు. రోజు వారి ఆహారంలో బాగం చేసుకుంటే ఎన్నోరకాల ఆరోగ్యప్రయోజనాలు దీనివల్ల చేకూరతాయి. శరీర బరువును తగ్గించేందుకు ముల్లంగి బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా లివర్, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచటంలో దోహదపడుతుంది.

ముల్లంగిలోకంటే ముల్లంగా ఆకుల్లో ఎక్కువ ప్రయోజనాలు దాగి ఉన్నాయి.ముల్లంగి విత్తనాలు, వేరు,ఆకులు అన్నింటిని కూరల్లో ఉపయోగించవచ్చు. ముల్లంగి ఆకులో శరీరానికి అవసరమైన అనేక విటమిన్లు మరియు మినిరల్స్ సమృద్దిగా ఉన్నాయి. అందువల్ల దీన్ని న్యూట్రీసియన్ రిచ్ డైట్ గా తీసుకుంటారు.

ముల్లంగి ఆకులు జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో చాలా ప్రభావవంతముగా పనిచేస్తాయి. జీవక్రియకు అవసరమైన పైబర్ ముల్లంగి ఆకులో సమృద్దిగా ఉంటుంది. అంతేకాక కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యల చికిత్సలో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు.. ఇటీవల కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది. కేవలం పెద్ద వారిలోనే కాదు.. చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. మూత్ర పిండాల్లో రాళ్లను కరిగించడంతో ముల్లంగి ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.

ముల్లంగి ఆకులతో రసాన్ని తయారు చేసుకుని.. ప్రతి రోజు కొద్దిగా తీసుకోవాలి. ఇలా చేస్తే ముల్లంగి ఆకులో ఉండే విటమిన్ బి సహాజంగా మూత్ర పిండాల్లో రాళ్లను కరిగించేస్తుంది.ఒకవేళ ముల్లంగి ఆకులను రసం తాగలేని వారు.. సలాడ్స్ ముల్లంగి ఆకులు వేసి తీసుకోవాలి. ముల్లండితో కలిపి ముల్లంగి ఆకులను వండుకుని తినొచ్చు. ఇలా ఎలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.

ముల్లంగి ఆకులు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముల్లంగి ఆకుల్లో ఉండే డైటరీ కంటెంట్  అలసటను నివారిస్తుంది. ముల్లంగి ఆకుల్లో ఉండే ఫాస్పరస్, ఐరన్ వంటివి శరీరంలో వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కీళ్ళవాపు, కీళ్ల నొప్పులు దూరం అవుతాయి. డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. అలసటను , నీరసంను నివారించడంలో సహాయపడుతుంది.

పైల్స్ ఉన్న వారిలో వాపు, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ముల్లంగి ఆకుల పొడి, పంచదారను సమాన పరిమాణంలో తీసుకోని నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని తినవచ్చు. లేదా పైల్స్ ప్రభావిత ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది. లివర్ కు వచ్చే కామెర్లను నివారించడంలో బాగా పనిచేస్తుంది. ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, నీళ్ళు సరిపడా నీళ్ళు కలిపి, వడగట్టి తాగడం వల్ల కామెర్ల నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. 10 రోజుల్లోనే కామెర్లు తగ్గుతాయి.

ముల్లంగి ఆకు శ్వాస వ్యవస్థలో అడ్డంకులను నిరోధిస్తుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థకు ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుతుంది. అలెర్జీలు, జలుబు, అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా నిరోధిస్తుంది.