డోంట్ మిస్ : చందమామను కచ్చితంగా చూడండి

10TV Telugu News

ఆకాశంలో అద్భుతం. చందమామ రావే.. జాబిల్లి రావే.. అని పిలవకుండానే ఈ రోజు(ఫిబ్రవరి-19-2019) రాత్రి చంద్రుడు మనకు చాలా దగ్గరగా వచ్చేశాడు. అధికమైన వెలుగుతో కనువిందు చేస్తున్నాడు. దీనికి ఫుల్‌ స్నో మూన్‌ అని పేరు పెట్టారు. సాధారణ పౌర్ణమి రోజుల్లోనే అబ్బురపరిచే నిండు చంద్రుడు.. ఇప్పుడు మరింత నిండైన వదనంతో దర్శనమిస్తున్నాడు.

 

40ఏళ్ల తర్వాత వచ్చిన సూపర్ స్నో మూన్ నింగిలో కనువిందు చేస్తోంది. 1979లో కనిపించిన నిండు పౌర్ణమి ఇవాళ తిరిగి వచ్చింది. భూమికి 2లక్షల 20వేల మైళ్ల దూరంలోని చందమామ మాములు కన్నా 14శాతం పెద్దగా, 30శాతం అధికంగా ప్రకాశిస్తున్నాడు. మరి మీరూ చందమాను చూశారా. లేకుంటే వెంటనే చూసి ఎంజాయ్ చేయండి. మిస్ మాత్రం కాకండి..

 

* భూమికి దగ్గరగా వచ్చిన చందమామ
* 14 శాతం పెద్దగా దర్శనం.. 30శాతం అధికంగా ప్రకాశం
* 40 ఏళ్ల తర్వాత వచ్చిన సూపర్ స్నో మూన్
* భూమికి 2లక్షల 20వేల మైళ్ల దూరంలో చందమామ
* 1979లో కన్పించిన నిండు పౌర్ణమి