మీరు హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా?

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 07:38 AM IST
మీరు హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా?

సాధారణంగా ఈ రోజుల్లో యువత  హెడ్ ఫోన్ లేకుండా కనిపించట్లేదు. హెడ్ ఫోన్స్ లో ప్లగ్ హెడ్ ఫోన్, వైర్ లెస్ హెడ్ ఫోన్ వంటివి రక రకాలుగా మార్కెట్ లో దొరుకుతున్నాయి. వాటిలో ప్లగ్ హెడ్ ఫోన్ చాలా మంది ఉపయోగిస్తున్నారు. ప్లగ్ హెడ్ ఫోన్ వల్ల చెవుడు వంటి సమస్యలకు గురి చేస్తుంది. 

ఇయర్ ఫోన్స్ ల్లో పెద్దగా సౌండ్స్ పెట్టుకుని  సంగీతం, పెద్ద శబ్దాలు వినడం వల్ల చెవుడు వస్తుందని డాక్టర్ గిరీష్ ఆనంద్ అన్నారు.ఇయర్ ఫోన్స్ లో మీరు ఎంతసేపు వింటారు, ఎంత పెద్దగా వింటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. యువత పై వినికిడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి అని అన్నారు.

కొలంబియాలోని సీనియర్ కన్సల్ టెంట్ డాక్టర్ సంతోష్ ప్లగ్ ఇయర్ పోన్స్ వలన చెవిలో నరాలు ఒత్తిడికి గురైయ్యి దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిని తెలిపారు. అంతే కాకుండా చెవిలో రిగింగ్, ఈలలు వంటి శబ్దాలు వినపడి టిన్నిటస్ వ్యాధి వస్తుంది. టిన్నిటస్ వ్యాధి వలన అధిక రక్తపోటు, తల, మెడ నోప్పులు వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సార్లు చిరాకు,కోపం, నిద్ర రాకపోవటం, ఒత్తిడి, థైరాయిడ్ వంటి సమస్యలు వస్తుంటాయి. ఇయర్ ఫోన్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు.