Breast Cancer : రొమ్ము క్యాన్సర్ విషయంలో అపోహల్లో వాస్తవమెంతంటే!

రొమ్ము క్యాన్సర్ ఉన్న వారి కుటుంబాల్లో మహిళలను పెళ్లి చేసుకునేందుకు వెనుకంజ వేస్తుంటారు. అయితే అది ఏమాత్రం అంటువ్యాధి కాదని గుర్తించాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే ఇతరులకు రాకపోవచ్చు.

Breast Cancer : రొమ్ము క్యాన్సర్ విషయంలో అపోహల్లో వాస్తవమెంతంటే!

Breast Cancer

Breast Cancer : మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ విషయంలో అనేక మందిలో అపోహలు నెలకొని ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ అన్నది వంశపారం పర్యంగా వచ్చే వ్యాధిగా చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని కేవలం ఐదు శాతం మందిలో మాత్రమే ఇది వంశపారం పర్యంగా వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తొలిదశలోనే రొమ్ము క్యాన్సర్ ను గుర్తించి చికిత్స అందిస్తే ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఒక కుటుంబంలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ ఉంటే మరొకరికి కూడా రావాలని ఏమిలేదు. రొమ్ము క్యాన్సర్ వచ్చిన మహిళలకు రెండు రొమ్ముల్లోనూ క్యాన్సర్ వస్తే మాత్రం మరొకరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వయస్సు పైబడిన మహిళల్లోనే ఎక్కువగా ఈ రొమ్ము క్యాన్సర్ రిస్క్ అధికంగా ఉంటుంది. మోనోపాజ్ దశలో సాధారణంగానే ఈ స్ట్రోజన్ హార్మోన్ తగ్గాల్సి ఉంటుంది. రుతుక్రమం ఆగిపోయి బరువు పెరగటం ప్రారంభమైతే వారిలో కొవ్వు అధికంగా పెరుగుతుంది. పెరిగే కొవ్వులో అరోమెటేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అరోమెటేజ్ కు అడ్రినల్ హార్మోన్ , మోనో పాజ్ తరువాత పెరిగే ఆండ్రోజన్ హార్మోన్ నూ ఈ స్ట్రోజన్ గా మార్చే గుణం ఉంటుంది. దీంతో రివర్స్ పక్రియ జరిగి ఈ స్ట్రోజన్ పెరగటం వల్ల రొమ్మ కాన్సర్ కు దారి తీస్తుంది. మోనోపాజ్ తరువాత బరువు పెరిగే వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

రొమ్ము క్యాన్సర్ ఉన్న వారి కుటుంబాల్లో మహిళలను పెళ్లి చేసుకునేందుకు వెనుకంజ వేస్తుంటారు. అయితే అది ఏమాత్రం అంటువ్యాధి కాదని గుర్తించాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే ఇతరులకు రాకపోవచ్చు. కొన్ని రకాల జన్యువుల మ్యూటేషన్ జరిగిన వారిలోనే ఇది వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ ను సరైన సమయంలో గుర్తించటం ద్వారా చికిత్స పొందవచ్చు. రుతుక్రమం ఆగిపోయిన తరువాత ఒక వైపు రొమ్ము నుండే రక్తస్రావం జరుగుతుంటే రొమ్ము క్యాన్సర్ గా అనుమానించాలి. రొమ్ములో గడ్డలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవటం మంచిది. రొమ్ములో గడ్డలు పెరుగుతుంటే అవి ప్రమాదకరమని గుర్తించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.