Sperm Cells : పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవటానికి కారణాలు అనేకం!

శారీరక కారణాలతోపాటు మానసిక కారణాలు కూడా వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడానికి తోడ్పడతాయి. మానసిక ఒత్తిడికి లోనవడం, మానసిక ఆందోళన, డిప్రెషన్ వల్ల వీర్యకణాలలో లోపాలు తలెత్తుతాయి. గవద బిల్లలు, క్షయ, మశూచి వంటి వ్యాధుల వల్ల కూడా వీర్యకణాల ఉత్పత్తి తగ్గుతుంది.

Sperm Cells : పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవటానికి కారణాలు అనేకం!

decrease in the number of sperm cells in men (1)

Sperm Cells : సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ సమస్య అనేక కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తుంది. సంతాన లేమి సమస్యకు ఏ ఒక్కరిదో లోపం కాకున్నా భార్యాభర్తలు ఇద్దరూ ఇందుకు కారణం కావచ్చు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పురుషులలో వీర్యకణాల సంఖ్య బాగా తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయంగా మారింది. పురుషులలో వీర్యంలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం, వీర్య కణాలు పూర్తిగా లేకపోవడం, వీర్య కణాలలో కదలికలు తగ్గడం, వీర్యకణాల ఆకృతి సరిగా లేకపోవడం వంటి లోపాలు కనిపిస్తాయి. వీర్యంలో వీర్యకణాల సంఖ్య పూర్తిగా లేకపోవటాన్ని ‘అజూస్పెర్మియా’గా వ్యవహరిస్తారు.

పొగతాగడం, మద్యం సేవించడం, గుట్కాలు నమలడం వల్ల కూడా వీర్యకణాలలో లోపాలు ఏర్పడతాయి. హార్యోన్లలో లోపాలు, వృషణాలలో వచ్చే సమస్యలు, సుఖవ్యాధులు, అంగస్తంభనలో లోపాలు మొదలైనవి కూడా పురుషులలో సంతానలేమికి దారితీస్తాయి. ఇవే కాకుండా అధిక బరువు, మధుమేహం వంటి సమస్యల వల్ల కూడా వీర్యకణాలలో లోపాలు ఏర్పడతాయి. అలాగే ఆహార అలవాట్లు, వాతావరణ కాలుష్యం, రసాయనాల వల్ల కూడా వీర్యకణాలు తగ్గిపోతాయి.

శారీరక కారణాలతోపాటు మానసిక కారణాలు కూడా వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడానికి తోడ్పడతాయి. మానసిక ఒత్తిడికి లోనవడం, మానసిక ఆందోళన, డిప్రెషన్ వల్ల వీర్యకణాలలో లోపాలు తలెత్తుతాయి. గవద బిల్లలు, క్షయ, మశూచి వంటి వ్యాధుల వల్ల కూడా వీర్యకణాల ఉత్పత్తి తగ్గుతుంది. వృషణాలలో వెరికోసిల్ ఉండడం వల్ల వృషణాలకు వేడి పెరిగి వీర్యకణాల సంఖ్య, కదలికలు లేకుండా పోతాయి. వీర్యంలో వీర్యకణాల సంఖ్య ప్రతి మిల్లీలీటర్‌కు 40 మిలియన్ల నుంచి 120 మిలియన్ల వరకు ఉంటాయి. వీటిలో కదలికలు కనీసం 50 శాతం , సరైన ఆకృతి కలిగినవి 60 శాతం వరకు ఉంటేనే సంతానం కలుగుతుంది.