Heart Health : గుండె ఆరోగ్యానికి అవసరమైన ఆహారాలు ఇవే…

కడుపు నిండా తినటం మంచిదికాదు. అలాగే తిన్న తరువాత ఏదో ఒక చిరుతిండి వల్ల కాలరీలు పెరిగిపోతాయి. ఇది కొన్ని రోజుల తరువాత ఊబకాయానికి దారి తీస్తుంది.

Heart Health :  గుండె ఆరోగ్యానికి అవసరమైన ఆహారాలు ఇవే…

Heart1

Heart Health : శరీరంలో ఉన్న అన్ని అవ‌య‌వాల్లోనూ గుండె చాలా ముఖ్య‌మైంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె నిరంత‌రాయంగా ప‌నిచేస్తుండాలంటే తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న విధానం క‌లిగి ఉండాలి. అలాకాకుంటే గుండె సంబంధిత సమస్యలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు ప‌దిలంగా ఉంచుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు స‌రైన పోష‌కాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. కొన్ని ర‌కాల ఆహారాలు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాల‌ను పెంచుతాయి. కానీ కొన్ని మాత్రం గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి. ఈ క్ర‌మంలోనే గుండె ఆరోగ్యం కోసం నిత్యం మంచి ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది.

జంక్ ఫుడ్ తినడాన్ని పూర్తిగా తగ్గించి విటమిన్స్, న్యూట్రియెంట్స్‌తో సమృద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువ మంది ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాల‌ను ఎక్కువ‌గా తింటుంటారు. నిజానికి ఇవి గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. వీటిలో ఆహారాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచేందుకు ప్రిజ‌ర్వేటివ్స్ క‌లుపుతారు. ఇవి మ‌న గుండె ఆరోగ్యానికి మంచివి కావు. వీటి వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌స్తాయి. క‌నుక ఈ ఆహారాల‌కు బ‌దులుగా ఆరోగ్య‌వంత‌మైన స్నాక్స్‌ను ఇంట్లోనే త‌యారు చేసుకుని తినాలి.

నిత్యం ఉప్పు, చ‌క్కెర ఎక్కువ‌గా ఉన్న ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి. ఉప్ప‌లో ఉండే సోడియం శ‌రీరానికి మంచిది కాదు. దీనివల్ల హైబపర్ టెన్షన్ వస్తుంది. అంతేకాకుండా చివరకు అది గుండె జబ్బులకు దారితీస్తుంది. అదే క్రమంలో చ‌క్కెర వ‌ల్ల అధికంగా బరువు పెరుగుతారు. అది కూడా గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు దారి తీస్తుంది. క‌నుక ఈ రెండు ప‌దార్థాల‌ను నిత్యం త‌క్కువ‌గా తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

నిత్యం మ‌నం తీసుకునే ఆహారంలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. దీంతో గుండె సంబంధ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు బాగా త‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. ఫైబ‌ర్ హైబీపీని త‌గ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి. ఇవి ఉన్న ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి. దీంతో శ‌రీరంలో వాపులు త‌గ్గుతాయి. త‌ద్వారా గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి క‌నుక వాటిని త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల గుండె వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. ఇక వెజిటేరియ‌న్లు న‌ట్స్‌, సీడ్స్ తిన‌డం ద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ల‌భిస్తాయి.

బాదంప‌ప్పు, వాల్‌న‌ట్స్ వంటి వాటిని నిత్యం గుప్పెడు మోతాదులో తింటే గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. వీటిల్లో ఉండే పోష‌కాలు గుండె ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుతాయి. న‌ట్స్‌ను తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు. అధికంగా బ‌రువు ఉండ‌డం వ‌ల్ల కూడా గుండె వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక బ‌రువును ఎప్పుడూ నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాలి. అధికంగా బ‌రువు ఉన్న‌వారు బ‌రువు త‌గ్గే ప్ర‌య‌త్నం చేయాలి. దీని వ‌ల్ల గుండె వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

ఆకలిగా అనిపించినప్పుడు రెండు బిస్కెట్లో, ఆలూ చిప్సో తినడం అందరూ చేసే పనే. కానీ, ఇందులో ఉండే కేలరీలు చాలా ఎక్కువ. ప్రాసెస్ చేసిన బిస్కెట్స్ లాంటివి వాటిలో ట్రాన్స్-ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కుకీస్, బిస్కెట్స్, కేక్స్ వంటివి కొనేటప్పుడు వాటిలో ఉన్న ట్రాన్స్-ఫ్యాట్ లెవెల్స్ లేబుల్ మీద చూసి కొనమని నిపుణులు సూచిస్తున్నారు. కడుపు నిండా తినటం మంచిదికాదు. అలాగే తిన్న తరువాత ఏదో ఒక చిరుతిండి వల్ల కాలరీలు పెరిగిపోతాయి. ఇది కొన్ని రోజుల తరువాత ఊబకాయానికి దారి తీస్తుంది. అందుకనే, ఎంత ఆహారం తీసుకుంటున్నారో గమనించడం అవసరం.

ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది. చికెన్, ఫిష్ పప్పులు, ఫ్యాట్ తక్కువ ఉన్న పాలూ, పాల పదార్ధాలూ, ఎగ్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. అదే విధంగా కూరగాయలూ, పండ్లలో విటమిన్స్, న్యూట్రియెంట్స్ లభిస్తాయి. వీటిలో కాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలూ, పండ్లూ వంటివి శాకాహరం లో ఉండే కొన్ని గుణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చేస్తాయి.