Heart Healthy Foods : గుండెకు మేలు చేసే ఆహారపదార్ధాలు ఇవే!

చేపలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సాల్మన్ ఫిష్ వంటివి తీసుకోవటం మంచిది. గుండెలో చెడు కొవ్వులను తొలగించి మంచి కొవ్వులను పెంచటానికి దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయపడతాయి.

Heart Healthy Foods : గుండెకు మేలు చేసే ఆహారపదార్ధాలు ఇవే!

These are the foods that are good for the heart!

Heart Healthy Foods : శరీరంలోని ముఖ్యమైన భాగం గుండె. ఎంతో సున్నితమైన ఈ అవయవాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఏ క్షణంలోనైనా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో గుండెకు ఆరోగ్యాన్ని అందించే ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. గుండుకు మేలు చేసే అహారాలు అనేకం ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

టొమాటా ; టొమాటలో్లోని లైకోపిన్ పోషకం గుండెకు మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించే పొటాషియం కూడా దీనిలో ఉంటుంది. పుల్లగా , తియ్యగా ఉండే టొమాటోలను రోజువారి ఆహారంలో చేర్చుకోవటం మంచిది.

చేపలు ; చేపలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సాల్మన్ ఫిష్ వంటివి తీసుకోవటం మంచిది. గుండెలో చెడు కొవ్వులను తొలగించి మంచి కొవ్వులను పెంచటానికి దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయపడతాయి. వారానికి రెండు సార్లు చేపలు తీసుకోవటం ఆరోగ్యకరం.

ఆకుపచ్చని కూరలు ; ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకు కూరలు గుండెకు బలాన్ని ఇస్తాయి. బచ్చలి కూర గుండెకు మంచిది.

స్ట్రాబెర్రీలు ; స్ట్రాబెర్రీలు రక్తనాళాల్ని వెడల్పు చేస్తాయి. గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని అధ్యయనంలో స్పష్టమైంది.

డ్రైఫ్రూట్స్ ; కిస్మిస్ , బాదం, ఎండు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే గుండెకు మంచిది. ద్రాక్ష పండ్లు గుండెకు సత్తవ నిస్తాయి.

డార్క్ చాక్లెట్లు ; డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయి. అధిక రక్తపోటు తగ్గటంతోపాటు, రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అయితే డార్క్ చాక్లెట్ లు మితిమీరి తినకూడదు.