Thyroid Problem : థైరాయిడ్ సమస్యను తగ్గించటంలో దోహదపడే సూపర్ ఫుడ్స్ ఇవే!

థైరాయిడ్ ఉన్న‌వారికి అయోడిన్ చాలా అవసరం. అందువల్ల, ఆహారంలో తగిన మొత్తంలో అయోడిన్ ఉండేలా చూసుకోవాలి. మంట, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని నివారించడానికి ప్రాసెస్డ్ ఫుడ్‌, ఫ్రై ఫుడ్‌, ఆహారాల‌కు దూరంగా ఉండాలి.

Thyroid Problem : థైరాయిడ్ సమస్యను తగ్గించటంలో దోహదపడే సూపర్ ఫుడ్స్ ఇవే!

These are the super foods that help in reducing the thyroid problem!

Thyroid Problem : జీవనశైలి మార్పులు, చెడు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల థైరాయిడ్‌ సమస్య ఎక్కువైంది. శరీర జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే థైరాయిడ్‌ గ్రంథి సక్రమంగా పని చేయాల్సి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలైన హార్మోన్లు రక్తప్రవాహంలో కలిసి కీలకమైన జీవక్రియలను నిర్వహిస్తాయి. శ్వాసవ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, సంతానోత్పత్తి వ్యవస్థ వంటి వాటిపై థైరాయిడ్ హార్మోన్‌ ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ గ్రంథి అవసరాన్ని మించి అధికంగా పనిచేస్తే గుండెదడ, చేతులు-కాళ్లు వణకడం, నిద్రలేమి, ఆందోళన, బరువు తగ్గిపోవడం, వేడిని తట్టుకోలేకపోవడం, ఆకలి పెరగడం, నెలసరి సమస్యలు, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనినే హైపర్‌థైరాయిడిజంగా పిలుస్తారు.

నిశ్చల జీవనశైలి, చెడు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, అయోడిన్ లోపం, ఆటో ఇమ్యూనిటీ కారణంగా థైరాయిడ్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్‌ కారణంగా బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, అలసట, నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చకపోవడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ఆహార పదార్థాలు థైరాయిడ్‌ సమస్యను తగ్గించడంలో దివ్యౌషధంలా పని చేస్తాయని ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆహార పదార్ధాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

థైరాయిడ్ సమస్యను తగ్గించే ఆహారాలు ;

1. పెసర పప్పు ; పెసర పప్పులో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. పెసర పప్పులో ఫైబర్, అయోడిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్‌ లక్షణాల్లో ఒకటైన మలబద్ధకాన్ని తగ్గించడంలో తోడ్పడతాయి. జీవక్రియ రేటును పెంచటంలో సహాయపడుతుంది.

2. గుమ్మడియ గింజలు ; గుమ్మడికాయ గింజల్లో జింక్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం ఇత విటమిన్లు, మినరల్స్‌ గ్రహించడానికి సహాయపడుతుంది. శరీరంలో థైరాయిడ్‌ హార్మోన్ల సంశ్లేషణ, సంతులనాన్ని ప్రోత్సహించడానికి కూడా ఇది చాలా ముఖ్యం.

3. ఉసిరికాయ ; ఉసిరికాయలో ఆరెంజ్‌ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ విటమిన్ సి, దానిమ్మపండు కంటే దాదాపు 17 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఉసిరి జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. తలలో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. ఉసిరి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

4 అయోడిన్ ; థైరాయిడ్ ఉన్న‌వారికి అయోడిన్ చాలా అవసరం. అందువల్ల, ఆహారంలో తగిన మొత్తంలో అయోడిన్ ఉండేలా చూసుకోవాలి. మంట, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని నివారించడానికి ప్రాసెస్డ్ ఫుడ్‌, ఫ్రై ఫుడ్‌, ఆహారాల‌కు దూరంగా ఉండాలి.

5. నీరు ; రోజంతా తగినంత నీళ్లు తాగాలి. శ‌రీరం డీహైడ్రేష‌న్ కాకుండా చూసుకోవాలి.

6. ఉలవలు ;వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

7. వెల్లుల్లి : వెల్లుల్లి లో సెలినియం అధికంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృద్రోగులకు మాత్రమే కాకుండా థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా మంచి ఆహారమని నిపుణులు సూచిస్తున్నారు.

8. కొబ్బరి : కొబ్బరిని పచ్చిగా తినడం అన్నది థైరాయిడ్ రోగులకు అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. ఇది జీవక్రియను పెంచుతుంది.