Bad Cholesterol : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోవాలంటే రోజువారిగా ఈ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవటం మంచిది!

బీట్‌రూట్ ముక్కలు తిన్నా, జ్యూస్ తాగినా ప్రయోజనం ఉంటుంది. బీట్‌రూట్‌లో కరిగే ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. మరోవైపు నైట్రేట్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త వాహికల్ని వెడల్పు చేయడంలో దోహదం చేస్తుంది. రక్త నాళికల్లో పేరుకునే చెడు కొలెస్ట్రాల్ దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.

Bad Cholesterol : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోవాలంటే రోజువారిగా ఈ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవటం మంచిది!

Bad Cholesterol :

Bad Cholesterol : జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే జీవనశైలిని అందుకు తగ్గట్టుగా మార్చుకోవల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్ధాలను దూరంగా పెట్టడం, కొన్నింటిని డైలీ డైట్‌లో చేర్చడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు . తద్వారా గుండె జబ్బులు వంటి వాటిని దూరంగా ఉంచవచ్చు. కొలెస్ట్రాల్ రక్తం సరఫరా చేసే ధమనులలో పేరుకుపోయి, వయసుతో పాటు వాటి స్థాయి కూడా పెరిగిపోయి గుండె సంబంధిత ప్రమాదాలకి కారణమౌతాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ ని తగ్గించే ఆహార పదార్థాల గురించి అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. ఆహారంతో పాటు తగిన వ్యాయామం చేయడం వల్ల నెమ్మదిగా కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి, గుండె సంబందిత వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చు.

ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు ఇష్టంగా తింటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు తగ్గుతాయి. వివిధ రకాల వ్యాధులు ఎటాక్ అవ్వకుండా రక్షణ పొందవచ్చు. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కొలెస్ట్రాల్ సమస్య ఉత్పన్నమౌతుంది. కొలెస్ట్రాల్ వల్ల గుండెపోటు ముప్పు పెరుగుతుంది. గుండెపోటు ముప్పు తగ్గాలంటే ముందు కొలెస్ట్రాల్ సమస్యను అరికట్టాలి. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కొన్ని రకాల కూరగాయల్ని డైట్‌లో చేర్చు కోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

చెడు కొలెస్ట్రాల్ తగ్గించే కూరగాయలు ;

1. బ్రోకలీ ; బ్రొకోలీని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. బ్రొకోలీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బ్రొకోలిలో విటమిన్ బి5, సి, ఇ లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, శక్తివంతమైన న్యూట్రీషియన్లు ఉన్నాయి. బ్రోకలీ అనేది ఫైబర్ అధికంగా ఉండే కూరగాయ. ఇందులో విటమిన్ సి, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్..శరీరంలో కొలెస్ట్రాల్‌ను తొలగించేందుకు దోహదం చేస్తుంది. బ్రొకలీ లో ఉండే ఫైబర్ జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది.

2. బీట్‌రూట్ ; బీట్‌రూట్ ముక్కలు తిన్నా, జ్యూస్ తాగినా ప్రయోజనం ఉంటుంది. బీట్‌రూట్‌లో కరిగే ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. మరోవైపు నైట్రేట్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త వాహికల్ని వెడల్పు చేయడంలో దోహదం చేస్తుంది. రక్త నాళికల్లో పేరుకునే చెడు కొలెస్ట్రాల్ దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా తీసుకున్నా గుండె సమస్యలు దూరమవుతాయి. కొలెస్ట్రాల్‌ని తరిమి కొట్టాలంటే బీట్‌రూట్ జ్యూస్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. జ్ఞాపకశక్తిని పెంచి బ్రెయిన్‌కి రక్తాన్ని సరఫరా చేస్తుంది.

3. పాలకూర ; పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రోజువారీ డైట్‌లో పాలకూరను తప్పకుండా ఉండేలా చూసుకోవడం మంచిది. ఎందుకంటే పాలకూర విటమిన్ సి అధికంగా ఉండే సీజనల్ కూర. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బందిపడేవాళ్లు పాలకూరను డైట్‌లో చేర్చుకుంటే దానిని తొలగించుకోవచ్చు. పాలకూరను రసంలా తీసి అందులో కాస్త అల్లం, నిమ్మరసం చేర్చి తీసుకుంటే అధిక బరువు కంట్రోల్ అవుతుంది. పాలకూరను ఉడికించుకుని ఆ రసంలో కొద్దిగా ఉప్పు, కూరగాయలు వేసి సూప్‌లా చేసుకుని తాగవచ్చు.