Child Immunity : చిన్నారులు ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే?..

పిల్ల్లల్లో రోగనిరోధక శక్తి పెరగటానికి నిద్రచాలా అవసరం. చాలా మంది పిల్లలు రాత్రిళ్ళు నిద్రపోకుండా టివిలు, సెలఫోనులు, వీడియో గేమ్స్ ఆడుతూ కాల‌క్షేపం చేస్తుంటారు. త‌ల్లిదండ్రులు ఇలాం

Child Immunity : చిన్నారులు ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే?..

Child Immunitey

Child Immunity : కరోనా ప్రభావంతో చిన్నారులు సైతం ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలా మంది చిన్నారులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై ఎక్కువగా కరోనా ప్రభావం ఉంది. చిన్నారుల్లో సాధారణంగా కరోనా కారణంగా గ్యాస్ట్రిక్‌ సమస్యలు, ఆకలి మందగించడం, వాంతులు, విరోచనాలు, ఒళ్లంతా దద్దుర్లు, జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఈ క్రమంలో చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంచటంపై తల్లిదండ్రులు ప్రధానంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. పిల్లలు నిత్యం దుమ్ము, ధూళిలో ఆడుతుంటారు. మరోవైపు శుభ్రత త‌క్కువ‌గా పాటిస్తారు. స్కూల్‌లోనూ ఇత‌ర పిల్లలతో క‌ల‌సి తిరగటంతో సహజంగానే వారికి వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

అయితే పిల్లలు అనారోగ్య సమస్యల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే వారిలో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచాలి. దీంతో ఇన్‌ఫెక్షన్లు బారి నుండి వారిని కాపాడవచ్చు. పిల్లలకు నిత్యం ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. ప్రోటీన్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ స‌మ‌తూకంలో ఉండే ఆహారం ఇవ్వాలి. దీంతో వారిలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది. అలాగే నిత్యం నిమ్మ జాతికి చెందిన పండ్లు, క్యారెట్లు, ఆకు ప‌చ్చని కూర‌గాయ‌లు, బీన్స్‌, స్ట్రాబెర్రీ, పెరుగు, వెల్లుల్లి, అల్లం తినిపించాలి. దీని వ‌ల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

పిల్ల్లల్లో రోగనిరోధక శక్తి పెరగటానికి నిద్రచాలా అవసరం. చాలా మంది పిల్లలు రాత్రిళ్ళు నిద్రపోకుండా టివిలు, సెలఫోనులు, వీడియో గేమ్స్ ఆడుతూ కాల‌క్షేపం చేస్తుంటారు. త‌ల్లిదండ్రులు ఇలాంటి పిల్లలను త్వరగా ప‌డుకోబెట్టాలి. నిద్ర స‌రిగ్గా పోక‌పోతే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయో పిల్లకు త‌ల్లిదండ్రులు చెప్పాలి. వారిని కంప్యూట‌ర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఇత‌ర గ్యాడ్జెట్లకు వీలైనంత దూరంగా ఉంచాలి. నిద్ర త‌గినంత‌గా ఉంటే పిల్లల్లో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

ఆహారం తినేముందు, తిన్నాక చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవాల‌ని పిల్లలకు చెప్పాలి. త‌ల్లిదండ్రులు పిల్లలకు ఆ అల‌వాటు చేయించాలి. ఆట‌లు ఆడుకున్నాక, కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులను ముట్టుకున్నసందర్భంలో తప్పనిసరిగా చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోమ‌ని చెప్పాలి. ఎందుకంటే పిల్లలకు వ‌చ్చే వ్యాధుల్లో ఎక్కువ శాతం దుమ్ము, ధూళిలో గ‌డ‌ప‌డం వ‌ల్ల‌, పెంపుడు జంతువుల‌ను ముట్టుకోవ‌డం వ‌ల్లే వ‌స్తాయి. క‌నుక ఈ విష‌యంలో త‌ల్లిదండ్రులు జాగ్రత్త వ‌హించాలి.

పిల్లలకు నిత్యం ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. ప్రోటీన్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ స‌మ‌తూకంలో ఉండే ఆహారం ఇవ్వాలి. దీంతో వారిలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది. అలాగే నిత్యం నిమ్మ జాతికి చెందిన పండ్లు, క్యారెట్లు, ఆకు ప‌చ్చని కూర‌గాయ‌లు, బీన్స్‌, స్ట్రాబెర్రీ, పెరుగు, వెల్లుల్లి, అల్లం తినిపించాలి. దీని వ‌ల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. డాక్టర్ల సూచ‌న మేర‌కు వీటిని పిల్లలకు ఇస్తుంటే పిల్లల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. జ్ఞాప‌క‌శ‌క్తి కూడా పెరుగుతుంది.

పిల్లలకు గుడ్లు తినిపించడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి తక్కువగా ఉన్న పిల్లలే తరచూ జ్వరం బారిన పడుతుంటారు. విటమిన్ డి ఉదయం పూట సూర్యరశ్మిలో లేదా కొన్ని రకాల ఆహారపదార్ధాల్లో లభ్యమవుతుంది. గుడ్లలో విటమిన్ డి తో పాటు విటమిన్ బి, ఈ, సెలీనియం ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతాయి. గోధుమ పిండి, బియ్యం, పాస్తా, బ్రెడ్ పెరుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచడానికి అద్భుతంగా పని చేస్తాయి.