Carom Seeds : అజీర్తి తగ్గి ఆకలి పెరగాలంటే ఒక టీ స్పూన్ వామును అన్నంతో కలిపి తీసుకున్నా చాలు!

Carom Seeds : అజీర్తి తగ్గి ఆకలి పెరగాలంటే ఒక టీ స్పూన్ వామును అన్నంతో కలిపి తీసుకున్నా చాలు!

Carom Seeds : ఒకరకమైన ఘాటు సువాసన వచ్చే వాము… మొక్క మొత్తం ఔషధ గుణాలతో ఉంటుంది. వామును సంస్కృతంలో ఉగ్రగంధ అంటారు. వాము కాస్త చేదుగానే ఉంటుంది. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. వామును వాడడం వల్ల వంటల రుచి పెరగడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇది చక్కటి వాసనను కలిగి ఉంటుంది. వాములో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వాము వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే దానిని మీరు రోజువారిగా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

వాముతో ప్రయోజనాలు ;

1. వాములో ఉండే రసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. తిన్న ఆహారం అరగకపోతే, త్రేన్పులు, ఏసీడీటీ సమస్య ఉంటే వాము కలిపిన భోజనం తినాలి. రోజూ 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ వాము, అర టీస్పూన్ అల్లం పొడిని నీటిలో కలిపి తాగితే ఛాతిలో మంటలు తొలగిపోతాయి.

2. ఎన్నో రకాల ఇన్ ఫెక్షన్ లు మన దరికి చేరకుండా వాము కాపాడుతుంది. వాములో థైమల్ అనే రసాయనం బ్యాక్టీరియా, ఫంగల్ వ్యాధులను నిరోధిస్తుంది. అంతేకాకుండా వాము యాంటీ సెప్టిక్ గా కూడా పని చేస్తుంది. తలనొప్పి, అలసట, జలుబు, మైగ్రేన్ వంటి వాటికి వాము మందులా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

3. గర్భిణీ స్త్రీలల్లో ఆకలిని పెంచి, గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో వాము ఎంతగానో దోహదపడుతుంది. కడుపు నొప్పి నుండి వాము తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

4. ముక్కులో సమస్యలు, ముక్కు దిబ్బడ ఉన్నా వాము, బెల్లాన్ని వేడి చేసి మిశ్రమంలా చేసి రోజూ 2 చెంచాలు చొప్పున రెండుసార్లు తీసుకోవాలి. దీని వల్ల ఆస్తమా, బ్రాంకైటీస్ లాంటి సమస్యలు తగ్గుతాయి. మైగ్రేన్ తలనొప్పి ఉంటే వాము పొడిని ఓ సన్నటి గుడ్డలో కట్టి తరచూ పీల్చాలి. సమస్య తగ్గుతుంది.

5. వామును గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకున్నా లేదా ఒక టీ స్పూన్ వామును అన్నంతో కలిపి తీసుకున్నా అజీర్తి తగ్గి ఆకలి పెరుగుతుంది. జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వాము నీటిని పుక్కిలించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.

6. మూత్రాపిండాల్లో రాళ్లను కరిగించే శక్తి కూడా వాముకు ఉంది. వామును తేనెతో కలిపి పది రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరిగే అవకాశం ఉందట.

7. నీళ్ల విరేచనాలను తగ్గించే గుణం కూడా వాముకు ఉంది. వాముతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి గాను ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. ఒక టేబుల్ స్పూన్ వామును వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని కొద్ది కొద్దిగా తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.

8. వేయించిన వామును, ఉప్పును కలిపి కచ్చా పచ్చగా దంచాలి. ఈ మిశ్రమాన్ని చిన్న పిల్లలకు రోజూ ఆహారంలో భాగంగా ఇవ్వడం అజీర్తి సమస్యలు తగ్గి ఆకలి పెరుగుతుంది. చిన్న పిల్లల్లో వచ్చే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను కూడా వామును ఉపయోగించి నయం చేసుకోవచ్చు.

9. వాము పొడిని ఒక టీ స్పూన్ బెల్లంతో కలిపి తింటే చర్మం పై వచ్చే అలర్జీలన్నీ తొలగిపోతాయి. వామును నోట్లో ఉంచుకుని కొద్ది కొద్దిగా రసాన్ని మింగుతూ ఉంటే టాన్సిల్స్ వాపులు తగ్గుతాయి.

10. ఒక టీ స్పూన్ వామును నీటిలో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్స్ ఒక వారంలోనే తొలగిపోతాయి. ప్రతిరోజూ వామును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారు వాము నూనెను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.

11. ఒకటి లేదా రెండు చుక్కల వాము నూనెను చెవిలో వేసుకోవడం వల్ల చెవి నొప్పి తగ్గుతుంది. ముక్కు దిబ్బడతో బాధపడుతున్నప్పుడు వామును ఒక వస్త్రంలో ఉంచి మూట కట్టి తరచూ వాసనను చూస్తూ ఉండడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

12. జుట్టు తెల్లగా మారుతుందా వాము, కరివేపాకులు, ఎండు ద్రాక్ష, చక్కెరను ఓ కప్పు నీటిలో వేసి ఉడికించండి. రోజూ ఇలా తాగండి. కొన్ని రోజుల్లో తలపై మార్పును గమనించవచ్చు.