ఉప్పు ఎక్కువ తింటున్నారా.. మీ ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది జాగ్రత్త

ఉప్పు ఎక్కువ తింటున్నారా.. మీ ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది జాగ్రత్త

SALT: ఉప్పు మరీ ఎక్కువగా తింటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుందని అంటున్నారు రీసెర్చర్లు. జర్నల్ సైన్స్ ట్రాన్‌స్లేషన్ మెడిసిన్ లో పబ్లిష్ అయిన కథనం ప్రకారం.. డైట్ లో ఉప్పు ఎక్కువగా ఉండటంతో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పెరుగుతుందని రీసెర్చ్ టీం తెలిపింది.

రోజుకు ఆరు గ్రాముల ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా ప్రమాదమే. అది రెండు ఫాస్ట్ ఫుడ్స్ తినడంతో సమానమట. అదే ఐదు గ్రాముల ఉప్పు తినడమంటే ఆ రోజులో ఉప్పును గరిష్టంగా తీసేసుకున్నట్లేనని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) చెప్తుంది.



ఉప్పు తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందని.. తొలి సారి నిరూపించగలిగామని స్టడీ రీసెర్చర్ క్రిస్టియన్ కర్ట్స్ అంటున్నారు. ఈ స్టడీలో ఫలితం అనూహ్యంగా వచ్చినట్లు సమాచారం.

నిజానికి ఈ లిస్టెరియా అనే ఇన్ఫెక్షన్ ఎలుక పిల్లల్లో మాత్రమే కనిపించింది. అంతకంటే ముందు జంతువులకు పెట్టే ఆహారంలో కొంచెం ఎక్కువ ఉప్పు వేసి అందించాం. దీనికి కారణంగా 100నుంచి 1000సార్లు సమస్య పెరిగిందన అర్థమైంది.

రోజు ఆరుగ్రాముల ఉప్పు తీసుకున్న వాలంటీర్లను పరీక్షించాం. అది దాదాపు రెండు ఫాస్ట్ ఫుడ్స్ కు సమానం. అంటే రెండు బర్గర్లు, రెండు ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నట్లు అన్నమాట.

వారం తర్వాత సైంటిస్టులు వారి బ్లడ్ శాంపుల్స్ తీసుకుని గ్రాన్యులోసైట్స్ పరీక్సించారు. వాటిల్లో ఉన్న బ్యాక్టీరియా పర్‌ఫార్మెన్స్ దారుణంగా ఉంది. అదంతా వారు ఉప్పు ఎక్కువగా తినడం వల్లే జరిగిందని అంచనాకు వచ్చారు.

ఇన్వెస్టిగేషన్ల ద్వారా పూర్తి వ్యవస్థను కవర్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇమ్యూనోడెఫిషియన్సీ వస్తుందని నిర్థారణ అయింది.